రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి : బండి సంజయ్
రైతుల్లో అయోమయం సృష్టించాలనే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.;
రైతుల్లో అయోమయం సృష్టించాలనే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు బండి సంజయ్. కొనుగోలు కేంద్రాలను తీసేయాలని రైతుల చట్టాల్లో ఎక్కడా లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు తీస్తామనడంలోనే కుట్ర దాగుందన్నారు. పంట కొనుగోళ్లలోనూ కేంద్రం వాటా ఉందన్నారు.