మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
ఖమ్మం కార్పొరేషన్ లో ఎన్నికల వేడి పెరిగింది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్థులు తరపున కీలక నేతలు ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు.;
ఖమ్మం కార్పొరేషన్ లో ఎన్నికల వేడి పెరిగింది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్థులు తరపున కీలక నేతలు ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మం చేరుకున్న సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. క్రమబద్ధీకరణ పేరుతో కోట్ల రూపాయల విలువైన భూములను మంత్రి స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంత్రి చెబుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఖమ్మంను మరింత అభివృద్ధి చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.