Bandi sanjay : తెలంగాణ మూర్ఖుడి చేతిలో బందీ అయింది : బండి సంజయ్
Bandi sanjay : తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికిబట్టకట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్.
Bandi Sanjay (tv5news.in)
Bandi sanjay : తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికిబట్టకట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్. యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మూర్ఖుడి చేతిలో బందీ అయిందన్నారు. అమరుల చరిత్ర కనుమరుగైందన్నారు. బీజేపీ చరిత్రను తిరగరాస్తుందన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. సామాన్య కార్యకర్తలకు బీజేపీలో ప్రాధాన్యముంటుందన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. బీజేపీతోనే ఉద్యమ ఆకాంక్షలు సాకారమవుతాయన్నారు. అడ్డుకుంటే బీజేపీ ఆగదన్నారు. బండి చక్రాల కింద టీఆర్ఎస్‌ను నలిపేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కలిసి పని చేయాలన్నారు. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కోసం పోరాడతామన్నారు.
తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశామన్నారు రాణి రుద్రమ. కానీ సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలు మరిచిపోయాయన్నారు. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు గతి లేవన్నారు. యువత కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదన్నారు. కేసీఆర్ లాంటి నియంతను ఎదుర్కొవడానికే బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నట్లు చెప్పారు.