కేసీఆర్ మెడలు వంచే దమ్ము బీజేపీకే ఉంది: బండి సంజయ్
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. ములుగులో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సభ నిర్వహించారు.;
2023లో గోల్కొండపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. ములుగులో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బండి సంజయ్... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ మెడలు వంచే దమ్ము బీజేపీకే ఉందని అన్నారు. కుహానా లౌకికవాదులు బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిరుద్యోగులకు 26 నెలల భృతి చెల్లించాలి డిమాండ్ చేశారు.