తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష..!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు.;
బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యాలయాలపై బాంబు దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.