Bandi Sanjay : ఓల్డ్ సిటీలో జాతీయ జెండాను గల్లీ గల్లీలో తిప్పిన ఘనత బీజేపీది..
Bandi Sanjay : ఓడిపోతారనే తెలిసే కేసీఆర్ డ్రామాలు మొదలు పెట్టారన్నారు బీజేపీ నేత బండి సంజయ్;
Bandi Sanjay : ఓడిపోతారనే తెలిసే కేసీఆర్ డ్రామాలు మొదలు పెట్టారన్నారు బీజేపీ నేత బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. పాతబస్తీలో పాక్ జెండాలు పట్టుకుని తిరిగేవారితో జాతీయ జెండాలు పట్టించామన్నారు. మునుగోడు ఓట్ల కోసమే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని విమర్శించారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టిన పార్టీ బీజేపేనని చెప్పారు.
అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన పార్టీ బీజేపేనని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్,ా వస్తున్నాడని తెలిసి సెప్టెంబర్ 17ను అధికారింగా నిర్వహించారన్నారు. ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ను, దళితులను టీఆర్ఎస్్ అడుగడునా మోసం చేసిందంటూ విమర్శించారు. ఇప్పుడు గిరిజనులను రిజర్వేషన్ ల పేరుతో మోసం చేసేందుకు సిద్దమవుతున్నారంటూ మండిపడ్డారు.