Bandi sanjay : మాపై దాడులకు సీఎం కేసీఆరే సూత్రధారి : సంజయ్
Bandi sanjay : తమపై TRS కార్యకర్తల దాడులకు ప్రధాన సూత్రధారి సీఎం కేసీఆరేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.;
Bandi sanjay : తమపై TRS కార్యకర్తల దాడులకు ప్రధాన సూత్రధారి సీఎం కేసీఆరేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. టూర్ షెడ్యూల్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు సంజయ్. సీఎం కేసీఆరే శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. వానాకాలం పంట కొనుగోలు చేసే వరకు వదిలేది లేదన్నారు.
40 లక్షల టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ఒప్పందం చేసుకుందన్నారు. ఇక అటు గవర్నర్ తమిళిసైని కలిసింది బీజేపీ నేతల బృందం. నిన్న నల్గొండ పర్యటనలో బండి సంజయ్ కాన్వాయ్ పై దాడి, పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సహా పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు, వానాకాలం పంటను కొనకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.