BANDI SANJAY: "తల నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ మాత్రం పెట్టను"

Update: 2025-11-07 04:00 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ప్ర­చా­రం­లో బండి సం­జ­య్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. బీ­జే­పీ ఎన్ని­కల ప్ర­చా­రం­లో బండి సం­జ­య్ కాం­గ్రె­స్-బీ­ఆ­ర్ఎ­స్‌­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. బీ­జే­పీ మీ­టిం­గ్‌­కు పర్మి­ష­న్ ఇచ్చి­న­ట్లే ఇచ్చి మళ్లీ రద్దు చే­శా­ర­ని ఆరో­పిం­చా­రు. అను­మ­తి ఇచ్చి­నా.. ఇవ్వ­క­పో­యి­నా ప్ర­చా­రా­ని­కి వస్తా­న­ని చె­ప్పా­న­ని.. చె­ప్పి­న­ట్లే వచ్చా­న­ని అన్నా­రు. రా­ష్ట్రం­లో కే­సీ­ఆ­ర్ గడీ­ని బద్ద­లు కొ­ట్టిం­ది బీ­జే­పీ­నే అని అన్నా­రు. ఎన్ని­క­లు రా­గా­నే ము­స్లింల టోపీ పె­ట్టు­కో­వ­డం కాం­గ్రె­స్‌ నే­త­ల­కు అల­వా­టు అయి­పో­యిం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. ఎక్కడ ఎన్ని­క­లు వచ్చి­నా ము­స్లిం టోపీ పె­ట్టు­కో­వ­డం, పా­కి­స్తా­న్‌­ను పొ­గ­డ­టం వం­టి­వి చే­స్తా­ర­ని మం­డి­ప­డ్డా­రు. తన వరకూ వస్తే.. తల అయి­నా నరు­క్కుం­టా కానీ ము­స్లిం టోపీ పె­ట్టు­కొ­ని మా­త్రం ఓట్లు అడు­క్కో­ను అని కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఇటీ­వల వస్తు­న్న సర్వే­ల­న్నీ భో­గ­స్ అని కొ­ట్టి­పా­రే­శా­రు. మరో­వై­పు.. రా­ష్ట్రం­లో బీ­ఆ­ర్ఎ­స్ పని అయి­పో­యిం­ద­ని.. ఆ పా­ర్టీ­కి ఓటు వేసి ఉప­యో­గం లే­ద­ని అన్నా­రు.

 "సన్న బియ్యం ఎట్ల ఆపుతారో చెప్పాలి"

కాం­గ్రె­స్‌­కు ఓటు వే­య­క­పో­తే సన్న బి­య్యం, ఫ్రీ బస్ ఆగి­పో­తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ వ్యా­ఖ్యా­నిం­చా­ర­ని.. అసలు ఎలా ఆపు­తా­రో చె­ప్పా­ల­ని కేం­ద్ర మం­త్రి కి­ష­న్‌­రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. సన్న­బి­య్యం­లో కేం­ద్ర ప్ర­భు­త్వా­ని­దే సిం­హ­భా­గ­మ­ని ఆయన గు­ర్తు చే­శా­రు.సకల సమ­స్య­ల­కు పరి­ష్కా­రం ఫ్రీ బస్సు అనే వి­ధం­గా కాం­గ్రె­స్ వ్య­వ­హ­రి­స్తోం­ద­న్న కి­ష­న్ రె­డ్డి.. కేం­ద్ర ప్ర­భు­త్వం నుం­చి వి­విధ అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­కు వచ్చిన ని­ధు­ల­ను, వచ్చిన సం­స్థల వి­వ­రా­లు కి­ష­న్‌­రె­డ్డి వి­వ­రిం­చా­రు. వచ్చే ఏడా­ది మొ­ద­టి త్రై­మా­సి­కం­లో బీ­బీ­న­గ­ర్ ఎయి­మ్స్ భవ­నా­లు ప్ర­ధా­న­మం­త్రి చే­తుల మీ­దు­గా ప్రా­రం­భ­మ­వు­తా­య­ని వె­ల్ల­డిం­చా­రు. 2 వందల బస్తీ దవా­ఖా­న­లు కేం­ద్రం సహ­కా­రం­తో నడు­స్తు­న్నా­యి… కే­సీ­ఆ­ర్ పేరు మా­ర్చా­ర­ని అన్నా­రు. కేం­ద్ర ప్ర­భు­త్వా­ని­కి సం­బం­ధిం­చి 101 అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు హై­ద్రా­బా­ద్లో జరు­గు­తు­న్నా­య­న్నా­రు. వి­విధ అం­శాల పై కే­సీ­ఆ­ర్‌­కు 40 లె­ట­ర్లు రా­శా­న­న్న కి­ష­న్ రె­డ్డి.. అయి­నా కే­సీ­ఆ­ర్ స్పం­దిం­చ­లే­ద­ని.. ఇప్పు­డు మా­త్రం వి­మ­ర్శ­లు చే­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు.

Tags:    

Similar News