Bandi Sanjay : చార్మినార్‌ పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంపై చేయి వేసి చూడాలని సవాల్‌ విసిరారు.;

Update: 2022-06-02 08:00 GMT

Bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చార్మినార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలంటూ చేపట్టిన సంతకాల సేకరణను తీవ్రంగా తప్పుబట్టిన సంజయ్‌.. ఇదంతా కాంగ్రెస్‌, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కలిసి చేస్తున్న డ్రామాలంటూ మండిపడ్డారు. దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంపై చేయి వేసి చూడాలని సవాల్‌ విసిరారు.

ఇన్ని రోజులు చార్మినార్‌ దగ్గర నమాజ్‌ ఎందుకు గుర్తుకురాలేదని… తాము భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని గుర్తించి పూజలు చేస్తేనే మీకు నమాజ్‌ గుర్తుకువచ్చిందా అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. పాతబస్తీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఎంతో కాలంగా అధికారంలో ఉన్న ఎంఐఎం... పాతబస్తీ వెనకబాటు తనానికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఓల్డ్‌ సిటీ న్యూ సిటీ, హైటెక్‌ సిటీ ఎందుకు కాలేదని… ఇక్కడ ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్‌ ఎందుకు రాలేదని… పాతబస్తీ ఉగ్రవాదులకు స్థావరంగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ఓవైసీ కుటుంబం తమ ఆస్తులను పెంచుకోడానికి తప్ప.. పాతబస్తీ అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదని అన్నారు.

Tags:    

Similar News