KCR : రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ వ్యూహం.. చిక్కుల్లో ఆ 8 మంది ఎమ్మెల్యేలు..

Update: 2026-02-27 05:04 GMT

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో రాజ్యసభ పోరు మొదలు కాబోతోంది. రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యేల ఓట్లతో జరగనున్న ఈ పోస్టుల కోసం బీఆర్ ఎస్ ఎలాంటి వ్యూహం రచిస్తుందా అనేదే ఇక్కడ అసలు కథ. అయితే ఈ ఎన్నికల్లో సంఖ్యా పరంగా గులాబీ పార్టీకి బలం లేదు. అయినా సరే ఎన్నికల బరిలో నిలవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికైనా పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ లోనే ఉన్నారంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ ఎన్నికల్లో ఆ 8 మంది ఎటువైపు ఓటేస్తారనేది బీఆర్ ఎస్ తేల్చాలని చూస్తోంది. ఒకవేళ వారు కాంగ్రెస్ కు ఓటేస్తే లీగల్ గా చిక్కుల్లో పడ్డట్టే. ఒకవేళ బీఆర్ ఎస్ కు ఓటేస్తారా అంటే అనుమానమే. కాబట్టి వారిని ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ ఎస్ ఈ ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్ కు సంఖ్యా పరంగా ఇద్దరు రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే ఛాన్స్ లేదు. ఈ 8 మంది సపోర్ట్ చేసి ఓటేస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. కానీ 8 మంది ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ కు ఓటేస్తే లీగల్ గా చిక్కులు తప్పవు. ఒకవేళ బీఆర్ ఎస్ కు ఈ ఎనిమిది మంది ఓటేసినా సరే రాజ్యసభ స్థానం దక్కకపోవచ్చు. కానీ ఆ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ ఎలాగూ దగ్గరకు రానివ్వట్లేదు. కాబట్టి వారు ఎటువైపు ఓటేస్తారా అన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్.

Tags:    

Similar News