Bandi Sanjay : సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్లైన్
Bandi sanjay : తెలంగాణలో దీపావళి లోపు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వస్తానని బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు డెడ్లైన్ విధించారు.;
తెలంగాణలో దీపావళి లోపు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వస్తానని బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు డెడ్లైన్ విధించారు. గతంలో యువకుల ఆత్మహత్యలపై పార్లమెంట్‌లో సుష్మాస్వరాజ్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. డిగ్రి, పీజీ చేసిన వాళ్లు ఉద్యోగాలు లేక ఉపాధి హామీ కూలికి వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో యువత ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రపంచమంతా మోడీ.. దేశమంతా యోగి అంటుందోని సంజయ్ పేర్కొన్నారు.