ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం.. చీపుర్లు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు..!
నిత్యం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ హడావుడిగా ఉండే బంజారాహిల్స్ పోలీసులు చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. సందర్భోచితంగా వ్యవహరించి సమాజసేవలో తమకు తామే సాటి అనిపించుకున్నారు.;
నిత్యం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ హడావుడిగా ఉండే బంజారాహిల్స్ పోలీసులు చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. సందర్భోచితంగా వ్యవహరించి సమాజసేవలో తమకు తామే సాటి అనిపించుకున్నారు. బంజారాహిల్స్ వెంగళ్‌రావు పార్క్ ఎదురుగా రోడ్డుపై ఓ వాహనం నుంచి పెద్ద మొత్తంలో ఇసుక జారి పడింది. దీనిపై నుంచి వెళితే వాహనాలు జారిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే చీపుర్లు పట్టి రోడ్డుపై పడి ఉన్న ఇసుకను తొలగించారు. ట్రాఫిక్ పోలీసుల సేవలను వాహనాదారులు ప్రశంసించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సైతం పోలీసులను అభినందించారు.