Beach in Hyderabad: నగరవాసులకు సరికొత్త అనుభవం.. ఆధునిక హంగులతో ఆర్టిఫిషియల్ బీచ్
సముద్రతీర అందాలు, ఎగసి పడుతున్న అలలు, బీచ్ లో పిల్లల కేరింతలు, పెద్దల సరదాలు అన్నీ ఆస్వాదించేందుకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది.
సముద్రతీర అందాలు, ఎగసి పడుతున్న అలలు, బీచ్ లో పిల్లల కేరింతలు, పెద్దల సరదాలు అన్నీ ఆస్వాదించేందుకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. త్వరలో కొత్వాల్ గూడ సమీపంలో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సముద్ర తీర అనుభవం కోసం తీర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరాన్ని ఈ బీచ్ తొలగించనుంది. అనేక కొత్త పర్యాటక ప్రాజెక్టులలో భాగంగా ఈ బీచ్ ఏర్పాటు కానుంది.
దీని కోసం మంగళవారం జరిగే ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో వివిధ సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తాయి.
35 ఎకరాల్లో కృత్రిమ బీచ్
ఈ ప్రాజెక్టులో భాగమైన హరిదామెరా మాట్లాడుతూ.. కృత్రిమ బీచ్ 35 ఎకరాల్లో వస్తోందని అన్నారు. రూ.235 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ బీచ్ స్పెయిన్ సాంకేతిక సహకారంతో రూపుదాల్చుకోనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్, ఇతర సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రవేశ రుసుము రూ.200లుగా నిర్ణయిస్తున్నారు. సందర్శకులు స్నానం మరియు బోటింగ్ సౌకర్యాలను కూడా ఆస్వాదించవచ్చని దామెరా తెలిపారు.