SPERM: వీర్యానికి రూ.5 వేలు.. అండానికి పది వేలు
బయటకు వస్తున్న స్పెర్మ్ కలెక్షన్ దందాలు... నగరం నడిబొడ్డున వీర్యం, అండం సేకరణ.. నో రూల్స్, నో సెంటిమెంట్... ఓన్లీ మనీ;
హైదరాబాద్‌లో సరోగసి దందాలో సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఇటీవల ఒకట్రెండు వెబ్‌సిరీస్‌ల్లో, సినిమాల్లో స్పెర్మ్ కలెక్షన్‌కు సంబంధించిన సీన్లు వెగటు పుట్టేలా ఉన్నా.. అవి పూర్తిగా బిజినెస్ మోడ్‌లో ఉన్నాయనేది వాస్తవం. ఇందులో స్పెర్మ్ కోసం వారికి పోర్న్ వీడియోలు చూపించడం, అమ్మాయిలను ఎరగా వేసి వారి నుంచి కలెక్ట్ చేసి వాటిని ఒక కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేయడం వంటి దృశ్యాలు.. ఇలా కూడా చేస్తారా అనే రీతిలో ఉన్నప్పటికీ ఈ తరహా దందా భాగ్యనగరంలోనే జరుగుతున్నదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. యువతకు డబ్బుల ఆశ చూపి వారికి గాలం వేసి ఏదో ఒక రీతిలో స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ దందా పూర్తిగా అక్రమమే అయినా మూడు స్పెర్మ్‌లు ఆరు అండాలుగా పెరిగిపోతున్నదని పోలీసులే చెబుతున్నారు. డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌లో పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి.. అహ్మదాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్న ముఠాలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఇండియన్ స్పెర్మ్‌టెక్’ పేరుతో వారు నిర్వహిస్తున్న స్పెర్మ్ బ్యాంకులోని యంత్రాలు, రిజిస్టర్లతో పాటు సరగసీ అప్లికేషన్లనూ స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని బ్లూ సీ హోటల్‌పై అంతస్తులో ఇండియన్ స్పెర్మ్‌టెక్ క్రయోసిస్టం క్లినిక్ ఉంది. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ, టెస్ట్ ట్యూబ్ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతున్నదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సరోగసి కోసం స్పెర్మ్ సేకరిస్తున్న క్లినిక్ నిర్వాహకులు స్పెర్మ్‌ని అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్పెర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇస్తున్నారు. అండాలకు కూడా ఇదే విధంగా ఇస్తున్నారు. కాలేజీ యువతను అట్రాక్ట్ చేసి వారి నుంచి స్పెర్మ్, ఎగ్స్ సేకరిస్తున్నారని, ఇందులో ఎగ్స్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది.
విస్తుపోయే నిజాలు
సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్సోనిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు పంకజ్‌తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెర్మ్, ఎగ్ శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఈ సంస్థ ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. మనదేశంలో సరోగసీ, స్పెర్మ్ కలెక్షన్లకు సంబంధించి నిర్దిష్ట చట్టాలున్నాయని డీఎంహెచ్‌వో వెంకటి తెలిపారు. , కమర్షియల్ సరోగసీ మన దేశంలో పూర్తిగా నిషేధమని ఆయన వెల్లడించారు.