పువ్వాడ అజయ్‌పై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు!
మంత్రి అజయ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్ని బినామీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు.;
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌పై.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి అజయ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్ని బినామీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. అహంకారంతో నియంతలా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయని, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోందని భట్టి తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మానిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో రేపు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. పార్టీ బూత్ కమిటీల బలోపేతంపై సమావేశంలో చర్చించనున్నట్టు భట్టివిక్రమార్క