Telangana Assembly: అసెంబ్లీలో భట్టి విక్రమార్క, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం..
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది.;
Telangana Assembly: తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడిచింది. విభజన బిల్లులో తెలంగాణకు రావాల్సిన వాటి గురించి ప్రభుత్వం కొట్టాడటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని భట్టి విమర్శించగా.. కల్పించుకున్న మంత్రి ఎర్రబెల్లి పార్లమెంట్‌లో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం గురించి కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడైనా కోట్లాడారా అని ప్రశ్నించారు. సంపద కల్గిన తెలంగాణలో వడ్డు కొనమంటే ఎలా అని, వరి ఉరే అన్న మాటలు వద్దని.. ఎట్టిపరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని భట్టీ డిమాండ్ చేశారు. దీనికి ఎర్రబెల్లి కౌంటర్ ఇస్తూ ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొని చూపించాలని సవాల్ విసిరారు.