తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన పోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోహరీశ్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 3న హరీశ్ రావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై ఆరోపణలు చేశారు.