హజురాబాద్ ఉప ఎన్నిక : ఈటల రాజేందర్ తిరుగులేని విజయం..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. హోరాహోరీ పోరులో ఈటల రాజేందర్‌కే హుజురాబాద్ ప్రజలు పట్టం కట్టారు.;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. హోరాహోరీ పోరులో ఈటల రాజేందర్‌కే హుజురాబాద్ ప్రజలు పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం ఓట్ల తేడాతో గెల్లు శ్రీనివాస్‌పై ఈటల గెలుపొందారు. ఇక.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన బల్మూరి వెంకట్ డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్లు లెక్కంచగా ఈటల రాజేందర్ ఓట్లు సాధించారు. గెల్లు శ్రీనివాస్ ఓట్లు సాధించగా.. బల్మూరి వెంకట్‌కు ఓట్లు పోలయ్యాయి.
కౌంటింగ్ మొదలైన మొదటి నుంచి బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఎనిమిది, పదకొండో రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ ఈటల సత్తా చాటారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీతో దూసుకెళ్లిన ఈటల.. చివరి రౌండ్ ముగిసే వరకు తన హవాను కొనసాగించారు. టీఆర్ఎస్‌కు పట్టున్న గ్రామాల్లోనూ బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హమ్మత్‌నగర్‌లో బీజేపీ అధిక్యం సాధించింది. అలాగే దళితబంధు పైలట్ ప్రాజెక్టు గ్రామం శాలపల్లి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు సొంతూరు సింగాపూర్‌లోనూ ఈటలకే ఎక్కువ ఓట్లు పోలవడం టీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది.
అటు హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ హవాతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ నివాసం దగ్గర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. ఈటల అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటున్నారు.. ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గరా సంబరాలు మిన్నంటాయి.. డప్పులు వాయిస్తూ బీజేపీ శ్రేణులు డ్యాన్సులతో హోరెత్తించాయి. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బండి సంజయ్, ఈటలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈటల గెలుపు హుజురాబాద్ ప్రజల విజయమని కిషన్‌రెడ్డి అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపే.. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి నాంది అన్నారు.
హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని ఎంపీ అరవింద్ అన్నారు. అవినీతి సొమ్ముతో గెలవాలని కుట్రలు చేసిన టీఆర్ఎస్‌కు హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారని అరవింద్ విమర్శించారు.
మొత్తానికి ఈటల రాజేందర్ తన హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోగా.. ఏడోసారి విజయాన్ని సాధించారు. దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన బీజేపీ.. ఇపుడు హుజురాబాద్‌లోనూ విజయఢంకా మోగించింది.