BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ

తుది దశకు చేరుకున్న కమలం కసరత్తు... ఢిల్లీ చేరుకున్న బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు.. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం

Update: 2025-10-12 03:30 GMT

హై­ద­రా­బా­ద్ జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­ల­పై బీ­జే­పీ కూడా కస­ర­త్తు చే­స్తోం­ది. ఎన్ని­క­ల్లో పోటీ చేసే అభ్య­ర్థి ఎం­పిక ప్ర­క్రియ ఢి­ల్లీ­కి చే­రిం­ది. తె­లం­గాణ బీ­జే­పీ అధ్య­క్షు­డు రాం­చం­ద­ర్ రావు ఢి­ల్లీ­కి చే­రు­కు­న్నా­రు. బీ­జే­పీ జా­తీయ నే­త­లు సు­నీ­ల్ బన్స­ల్, బీ­ఎ­ల్ సం­తో­ష్ ల తో ఆయన భేటీ కా­ను­న్నా­రు. ఈ భే­టీ­లో జూ­బ్లీ­హి­ల్స్ అభ్య­ర్థి ఎం­పి­క­పై చర్చిం­చే అవ­కా­శం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఇప్ప­టి­కే ఆశా­వ­హుల షా­ర్ట్ లి­స్ట్ తయా­రు చే­సిం­ది బీ­జే­పీ. ఆ షా­ర్ట్ లి­స్ట్ లో లంకల దీ­ప­క్ రె­డ్డి, కీ­ర్తి రె­డ్డి, వీ­ర­ప­నే­ని పద్మ పే­ర్లు ఉన్న­ట్లు సమా­చా­రం. ఇప్ప­టి­కే అభ్య­ర్థి ఎం­పిక వి­ష­యం­లో బీ­ఆ­ర్ఎ­స్ ముం­దుం­ది. బీ­ఆ­ర్ఎ­స్ తన అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చ­డ­మే కా­కుం­డా ప్ర­చా­రం పర్వా­న్ని ము­మ్మ­రం చే­సిం­ది. అటు కాం­గ్రె­స్ సైతం తమ అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చే­సిం­ది. నవీ­న్ యా­ద­వ్ కు టి­కె­ట్ ఇచ్చిం­ది. ఇక బీ­జే­పీ జా­తీయ అధి­నా­య­క­త్వం కూడా ఒకటి రెం­డు రో­జు­ల్లో అభ్య­ర్థి­ని ఫై­న­ల్ చే­య­నుం­ది. టి­కె­ట్ ఎవ­రి­కి ఇచ్చి­నా మి­గ­తా వ్య­క్తు­లు.. పా­ర్టీ ని­ర్ణ­యా­ని­కి కట్టు­బ­డి పని చే­యా­ల్సిం­దే­న­ని, అభ్య­ర్థి వి­జ­యం కోసం కృషి చే­యా­ల­ని బీ­జే­పీ అధి­నా­య­క­త్వం తే­ల్చి చె­ప్పిం­ది.

ఢిల్లీ చేరుకున్న బీజేపీ చీఫ్

అభ్య­ర్ధి­ని ఖరా­రు చే­సేం­దు­కు పా­ర్టీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు రాం­చం­ద­ర్‌­రా­వు ఢి­ల్లీ­కి చే­రు­కు­న్నా­రు. పా­ర్టీ జా­తీయ నే­త­లైన బీ­ఎ­ల్​­సం­తో­ష్, సు­న్సీ­ల్​­భ­న్స­ల్‌­తో సమా­వే­శ­మైన ఇటీ­వల ఆయ­న­కు త్రి­స­భ్య కమి­టీ ఇచ్చిన ని­వే­దిక అం­ద­జే­సి­న­ట్లు పా­ర్టీ వర్గా­లు తె­లి­పా­యి. పా­ర్టీ పా­ర్ల­మెం­ట­రీ బో­ర్డు చర్చిం­చిన అనం­త­రం అభ్య­ర్ధి ప్ర­క­టన ఉం­టుం­ద­ని తె­లి­సిం­ది. కమి­టీ ఇచ్చిన ని­వే­ది­క­లో దీ­ప­క్‌­రె­డ్డి, కీ­ర్తి­రె­డ్డి, వీ­ర­ప­నే­ని పద్మ పే­ర్లు ఉన్న­ట్లు పా­ర్టీ­లో టా­క్​­వి­ని­పి­స్తోం­ది. వీరు ఇప్ప­టి­కే ని­యో­జ­క­వ­ర్గం­లో ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. కాం­గ్రె­స్, బీ­ఆ­ర్‌­ఎ­స్​­పా­ర్టీ­ల­ను గె­లి­పి­స్తే దో­చు­కో­వ­డం, దా­చు­కో­వ­డం తప్ప అభి­వృ­ద్ధి ఉం­డ­ద­ని వి­మ­ర్శ­లు చే­స్తు­న్నా­రు. 11 ఏళ్ల మోడీ పా­ల­న­లో దే­శం­లో అభి­వృ­ద్ది­లో దూ­సు­క­పో­తుం­ద­ని, తె­లం­గాణ కూడా పా­ర్టీ­ని ప్ర­జ­లు ఆద­రిం­చా­ల­ని కో­రు­తు­న్నా­రు. హై­క­మాం­డ్​­రా­ష్ట్ర నా­య­కు­లు పం­పిం­చిన జా­బి­తా­లో­ని ము­గ్గు­రి రా­జ­కీయ నే­ప­థ్యం, ప్ర­జ­ల్లో పలు­కు­బ­డి, పా­ర్టీ­కి అం­దిం­చిన సే­వ­ల­ను పరి­గ­ణ­లో­కి తీ­సు­కు­ని ఎం­పిక చే­య­ను­న్న­ట్లు సీ­ని­య­ర్లు తె­లి­పా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో పోటీ చేస్ అభ్య­ర్థు­ల­ను బీ­ఆ­ర్‌­ఎ­స్, కాం­గ్రె­స్ ప్ర­టిం­చే­శా­యి. ఇప్పు­డు బీ­జే­పీ ఎవ­ర్ని బరి­లో­కి దిం­పు­తుం­ద­నే చర్చ సా­గు­తోం­ది. లో­క­ల్‌­గా పట్టు­న్న ఆయ­నై­తే సీటు గె­ల­వ­డం సు­ల­భం అవు­తుం­ద­ని ఎంత మంది పో­టీ­లో ఉన్నా నవీ­న్ యా­ద­వ్‌­వై­పు ము­ఖ్య­మం­త్రి, మి­గ­తా పా­ర్టీ నా­య­కు­లు ని­ల­బ­డ్డా­రు.

బీజేపీ చీఫ్‌కు తొలి ఎన్నిక

బీ­జే­పీ తె­లం­గాణ పా­ర్టీ పగ్గా­లు అం­దు­కు­న్న రాం­చం­ద్ర­ర్‌­రా­వు ఎదు­ర్కం­టు­న్న తొలి ఎన్నిక ఇదే కా­వ­డం­తో, ఆయన వ్యూ­హా­లు ఎలా ఉం­టా­యి, అభ్య­ర్థి ఎం­పి­క­లో ఏం చే­స్తా­ర­నే చర్చ జో­రు­గా సా­గు­తోం­ది. ఇప్ప­టి­కే జూ­బ్లీ­హి­ల్స్‌ ఉపఎ­న్ని­క­ల్లో పోటీ చే­య­డా­ని­కి అభ్య­ర్థి ఎం­పి­క­కు ప్ర­త్యేక కమి­టీ వే­శా­రు. ధర్మా­రా­వు, పో­తు­గం­టి రా­ము­లు, అం­జ­నే­య­లు చాలా మంది పే­ర్లు పరి­శీ­లిం­చా­రు. వీ­ళ్లు వి­విధ మా­ర్గా­ల్లో పా­ర్టీ వర్గా­ల­తో మా­ట్లా­డా­రు. పా­ర్టీ శ్రే­ణుల అభి­ప్రా­యా­లు తె­లు­సు­కు­న్నా­రు. దీ­ని­పై సమ­గ్ర ని­వే­దిక రా­ష్ట్ర అధ్య­క్షు­డి­కి ఇచ్చా­రు. వీరు పం­పిం­చిన పే­ర్ల­ను పరి­శీ­లిం­చిన తర్వాత వా­రి­లో షా­ర్ట్ లి­స్ట్ చేసి ము­గ్గు­రు పే­ర్ల­ను అధి­ష్ఠా­నా­ని­కి పం­పి­స్తా­రు. దీ­న్ని రా­ష్ట్ర బీ­జే­పీ కీలక నే­త­లు పరి­శీ­లిం­చి ఈ లి­స్ట్‌­ను ఢి­ల్లీ పం­పి­స్తా­రు. శు­క్ర­వా­రం వా­టి­ని పరి­శీ­లిం­చ­ను­న్న అధి­ష్ఠా­నం ఒకరి పే­రు­ను ఫై­న­ల్ చే­స్తుం­ది. కమి­టీ పే­ర్కొ­న్న లి­స్టు­లో చాలా పే­ర్లు ఉన్న­ప్ప­టి­కీ టా­ప్‌­లో మా­త్రం లంకల దీ­ప­క్ రె­డ్డి, వీ­ర­ప­నే­ని పద్మ, కీ­ర్తి­రె­డ్డి ఉన్నా­ర­ని పా­ర్టీ వర్గాల నుం­చి అం­దు­తు­న్న సమా­చా­రం. వీ­రి­లో దీ­ప­క్ రె­డ్డి గత ఎన్ని­క­ల్లో పోటీ చేసి ఓడి­పో­యా­రు. అం­దు­కే ఆయ­న­కే ఈసా­రి కూడా మరో ఛా­న్స్ ఇస్తా­ర­ని ఆయన వర్గం గట్టి­గా­నే ప్ర­చాంర చే­స్తోం­ది. రా­ష్ట్ర, ఢి­ల్లీ స్థా­యి­లో కూడా కీలక నే­త­ల­తో ఉన్న సం­బం­ధా­లు ఆయ­న­కు అక్క­ర­కు వస్తా­య­ని అం­టు­న్నా­రు. మహి­ళ­కు ఇవ్వా­ల­ను­కుం­టే మా­త్రం కీ­ర్తి­రె­డ్డి­కి లక్కీ ఛా­న్స్ ఉం­టుం­ద­ని చె­బు­తు­న్నా­రు. తె­లం­గా­ణ­లో జరు­గు­తు­న్న జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­పై అన్ని పా­ర్టీ­లు గట్టి­గా ఫో­క­స్ పె­ట్టా­యి. అం­దు­కు తగ్గ­ట్టు­గా­నే పా­ర్టీ­లు సన్న­ద్ధ­మ­వు­తు­న్నా­యి. ముం­దే అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చిన బీ­ఆ­ర్‌­ఎ­స్ ప్ర­చా­రం­లో దూ­సు­కె­ళ్తోం­ది.

Tags:    

Similar News