బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం
ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం దూసుకెళ్లారు.;
హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చారు. దీంతో.. బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అటు.. ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం దూసుకెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.