కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు ( Teenmaar Mallanna ) ఉద్యోగాలు వచ్చాయని, గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రం రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ను ఆయన పరామర్శించారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిరుద్యోగులను మోసగిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల కోసం వారిని వాడుకుందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీరు యువతను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వార్తాపత్రికల్లో యాడ్‌లు ఇచ్చారు. 7 నెలలు దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఎలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు? ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోనందున మీరైనా స్పందించండి’ అని Xలో డిమాండ్ చేశారు.