SOWMYA: కానిస్టేబుల్ సౌమ్య వీర మరణం.. సజ్జనార్ సెల్యూట్

పరిస్థితి విషమించడంతో సౌమ్య మరణం

Update: 2026-02-01 04:15 GMT

జనవరి 23న నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు విడించింది. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆమె చివరకు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నిజామాబాద్‌లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులును పట్టుకునేదుకు ఎక్సైజ్ ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సౌమ్య డ్యూటీకి వెళ్లింది. అయితే పోలీసులను చూసిన గంజాయి స్మగ్లర్లు కారు ఆపకుండా సిబ్బందిపైకి పోనిచ్చారు. ఈ ఘటనలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. చికిత్సలో భాగంగా అక్కడే ఓ కిడ్నీని తొలగించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం అందించేందుకు జనవరి 25 అర్ధరాత్రి పంజాగుట్ట నిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. నిమ్స్ ఆర్‌ఐసీయూలో చేర్చుకొని వైద్యం అందించారు. ఎమర్జెన్సీ కేర్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రో విభాగాల ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించడంతో సౌమ్య వీర మరణం పొందింది.  

 సౌమ్య ధైర్యానికి సజ్జనార్ సెల్యూట్

గంజాయి అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల సీపీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనవరి 23న నిందితులు కారుతో ఢీకొట్టగా, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో సౌమ్య చూపిన ధైర్యం, త్యాగం వెలకట్టలేనివని సజ్జనార్ కొనియాడారు. సమాజ రక్షణ కోసం పోరాడిన ఆ వీరనారికి ఆయన ఘన నివాళులర్పించారు.

Tags:    

Similar News