BRS: ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీ

గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా... యూరియా సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రైతుల కోసం బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన

Update: 2025-08-31 04:30 GMT

తె­లం­గా­ణ­లో అసెం­బ్లీ సమా­వే­శా­లు జరు­గు­తు­న్న వేళ యూ­రి­యా కొరత అం­శం­పై బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు ఆం­దో­ళ­న­కు ది­గా­రు. శని­వా­రం అసెం­బ్లీ సమా­వే­శాల ప్రా­రం­భా­ని­కి ముం­దు గన్‌­పా­ర్క్‌­కు చే­రిన బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు “గణ­ప­తి బప్పా మో­రి­యా, కా­వా­ల­య్యా యూ­రి­యా” ని­నా­దా­ల­తో ప్ర­భు­త్వా­న్ని లక్ష్యం­గా ని­నా­దా­లు చే­శా­రు. రై­తు­లు ఎరు­వుల కొ­ర­త­ను ఎదు­ర్కొం­టు­న్నా­ర­ని, ప్ర­భు­త్వం సమ­స్య పరి­ష్కా­రం కోసం చర్య­లు తీ­సు­కో­వ­డం లే­ద­ని కే­టీ­ఆ­ర్ ఆరో­పిం­చా­రు.

అసెంబ్లీ నుంచి ర్యాలీ

రై­తుల సమ­స్య­ల­పై ఆం­దో­ళన వ్య­క్తం చే­సిన బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు అసెం­బ్లీ నుం­చి అగ్రి­క­ల్చ­ర్ కమి­ష­న­రే­ట్ కా­ర్యా­ల­యా­ని­కి ర్యా­లీ చే­శా­రు. అక్కడ అధి­కా­రు­లు కు వి­న­తి­ప­త్రం అం­దిం­చి యూ­రి­యా సమ­స్య­ను పరి­ష్క­రిం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. తర్వాత వ్య­వ­సాయ కమి­ష­న­ర్ కా­ర్యా­ల­యం ముం­దు­కు బై­ఠా­యిం­చి ని­ర­సన వ్య­క్తం చే­శా­రు. ఈ చర్య­ల­పై పో­లీ­సు­లు బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.

సచివాలయం వద్ద ధర్నా

ఆం­దో­ళన కొ­న­సా­గి­స్తూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు తె­లం­గాణ సచి­వా­ల­యం వద్ద­కు చే­రా­రు. ఖాళీ యూ­రి­యా సం­చు­ల­తో బా­రీ­కే­డ్ల­ను దా­టా­రు. హరీ­శ్ రావు, కౌ­శి­క్ రె­డ్డి, ఇతర ఎమ్మె­ల్సీ­లు సచి­వా­ల­యం గే­ట్ల­కు పరు­గు­లు పె­ట్టి ని­ర­సన తె­లి­పా­రు. రై­తుల సమ­స్య­ల­ను ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని, రా­జ­కీ­యాల కోసం రై­తు­ల­తో ఆడు­కో­వ­ద్ద­ని ని­నా­దా­లు చే­శా­రు. దీం­తో పో­లీ­సు­లు బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.


రాజకీయ వాదనలు

యూ­రి­యా కొ­ర­త­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వ­మే పూ­ర్తి బా­ధ్యు­లు అని మాజీ మం­త్రి హరీ­ష్ రావు ఆరో­పిం­చా­రు. కేం­ద్రం, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు రై­తుల సమ­స్య­ల­ను వెం­ట­నే పరి­ష్క­రిం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. సమ­స్య­ను పరి­ష్క­రిం­చ­క­పో­తే అసెం­బ్లీ­ని స్తం­భిం­ప­జే­స్తా­మ­న్నా­రు. యూ­రి­యా కొ­ర­త­పై తె­లం­గాణ వ్యా­ప్తం­గా బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు ఆం­దో­ళ­న­లు చే­శా­రు. రై­తుల సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చ­డం కోసం బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు ఆం­దో­ళన కొ­న­సా­గి­స్తా­ర­ని, అవ­స­ర­మై­తే మరి­న్ని ధర్నా­ చే­ప­ట్టు­తా­మ­ని, రై­తు సమ­స్య తీ­రే­వ­ర­కు తమ ఉద్య­మం కొ­న­సా­గు­తుం­ద­ని హరీ­శ్ స్ప­ష్టం చే­శా­రు.

గులాబీ పార్టీ వ్యూహం అదేనా..?

సభ వా­యి­దా పడిన తర్వాత నుం­చి బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వి­శ్వ­రూ­పం చూ­పిం­చిం­ది. ఎరు­వుల కొరత ఎప్పు­డు తీ­రు­స్తా­ర­ని వ్య­వ­సాయ కమి­ష­న్ కా­ర్యా­ల­యా­ని­కి వె­ళ్లా­రు. ప్ర­భు­త్వం­తో మా­ట్లా­డి సమయం చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ప్ర­భు­త్వా­ని­కి వ్య­తి­రే­కం­గా ని­నా­దా­లు చే­శా­రు. అధి­కా­రుల నుం­చి సరైన సమా­ధా­నం రా­లే­ద­ని బై­ఠా­యిం­చా­రు. అక్క­డ­కు పో­లీ­సు­లు వచ్చి వా­రి­ని అరె­స్టు చే­య­డం­లో కా­సే­పు హై­డ్రా­మా నడి­చిం­ది. ప్ర­జా ఉద్య­మా­లు చే­య­ని­దే ఏ పా­ర్టీ అయి­నా నేత అయి­నా ప్ర­జల మన­న్న­లు పొం­ద­లే­డు. ని­త్యం ఏదో సమ­స్య­పై పో­రా­డు­తూ ప్ర­జ­ల్లో ఉం­టే­నే వా­ళ్ల­కు గు­ర్తిం­పు ఉం­టుం­ది. 202౩లో అనూ­హ్యం­గా ఓటమి చవి చూ­సిన బీ­ఆ­ర్‌­ఎ­స్ ఒక్క­సా­రి­గా డీ­లా­ప­డి­పో­యిం­ది. ఆ పా­ర్టీ అధి­నేత కే­సీ­ఆ­ర్‌ అయి­తే బయ­ట­కు రా­వ­డ­మే మా­నే­శా­రు. అప్పు­డ­ప్పు­డు బహి­రంగ సభలు పె­ట్టా­రే తప్ప మరో చోట కని­పిం­చ­డం లేదు. దీం­తో పా­ర్టీ కే­డ­ర్ పూ­ర్తి­గా నై­రా­శ్యం­లో ము­ని­గి­పో­యిం­ది. కే­టీ­ఆ­ర్, హరీ­ష్ రావు లాం­టి వా­ళ్లు ప్ర­జ­ల్లో ఉం­టు­న్నా అను­కు­న్నంత మై­లే­జీ రా­వ­డం లేదు. యూ­రి­యా కొ­ర­త­పై సభలో చర్చిం­చా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ గట్టి­గా పట్టు­బ­డు­తోం­ది. ఇదే వి­ష­యం­పై సభను స్తం­భిం­ప­జే­య­నుం­ది. కా­ర్యా­క­లా­పా­ల­ను అడ్డు­కో­నుం­ది. అవ­స­రం అయి­తే సభలో వేటు వే­యిం­చు­కొ­ని ప్ర­జ­ల్లో­కి వె­ళ్లే­లా ప్లా­న్ చే­స్తోం­ది. ఇప్ప­టి­కే లో­క­ల్ బాడీ ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్ షె­డ్యూ­ల్ వచ్చిం­ది. దీం­తో బల­ని­రూ­పణ చే­సు­కొ­ని ప్ర­జ­ల్లో మరో­సా­రి సత్తా చా­టు­కో­వా­ల­ని స్కె­చ్ వే­సిం­ది.

Tags:    

Similar News