BRS: కవితను పట్టించుకోని బీఆర్ఎస్
అనుచిత వ్యాఖ్యలపై జాగృతి ఆగ్రహం... ఇప్పటివరకూ స్పందించని గులాబీ పార్టీ;
ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ ఆమెపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరపడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్‌కు కవిత ఫిర్యాదు చేశారు. అయితే తనపై కవిత హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. ఇలా ఇద్దరి మధ్య వివాదం చెలరేగుతున్నా ఇప్పటివరకూ బీఆర్ఎస్ మాత్రం కవిత విషయంపై కనీసం స్పందించలేదు.పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండాతో వెళుతోందని భావించడం వల్లే ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు , రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు తదితర కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోలేదన్న చర్చకు తెరలేచింది. పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండాతో వెళుతోందని భావించడం వల్లే ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు , రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు తదితర కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోలేదన్న చర్చకు తెరలేచింది.
మల్లన్నను పట్టించుకోని కాంగ్రెస్
ఇరు పక్షాలకు చెందిన పార్టీలు మాత్రం గంటలు గడిచినా.. దాడులు జరిగి దుమారం రేగినా ఈ వ్యవహా రంపై స్పందించలేదు. తీన్మార్ మల్లన్న వ్యవహారానికి వస్తే.. ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు.. నేరుగా సంధించిన సూటి పోటి మాటలతో గత కొన్నాళ్లుగా పార్టీ ఆయనను పక్కన పెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా.. ఆయన విషయంలో సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా వివాదంపై కూడా అందరూ మౌనంగా ఉన్నారు. ఇక, కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమెను కూడా బీఆర్ ఎస్ అధినాయకత్వం దాదాపు పక్కన పెట్టింది. ఆమె గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ స్పందించడం లేదు. అంతర్గత కుమ్ములాటలతోపాటు.. కేటీఆర్‌ను తోసిరాజని కవిత చేస్తున్న దూకుడు వ్యవహారంతో పార్టీలో ఆమె గురించి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. వ్యక్తిగత పోరాటమో తప్ప.. ఇరువురి ముందు మరోమార్గం లేదని అంటున్నారు పరిశీలకులు.