TG: మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ నేత షకీల్‌ అరెస్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో షకీల్‌ అరెస్ట్;

Update: 2025-04-11 02:30 GMT

బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌‌‌ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున షకీల్ తల్లి కన్నుమూయడంతో దూబాయి‌లో ఉంటున్న షకీల్ హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే గతంలో పలు కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉండటంతో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన తల్లి అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు ఆయనను విడిచి పెట్టారు. అంత్యక్రియల అనంతరం పోలీసులు షకీల్‌ని అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇవి ఆరోపణలు

ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పంజాగుట్ట పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్‌పై గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు విషయం తెలిసిన షకీల్‌ ఇండియాకు రాకుండా దుబాయ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని షకీల్‌ను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News