BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత !

దాదాపుగా ఖరారు చేసిన గులాబీ పార్టీ

Update: 2025-09-11 06:00 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­కల వి­ష­యం­లో బీ­ఆ­ర్ఎ­స్ కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్టు తె­లు­స్తోం­ది. బీ­ఆ­ర్‌­ఎ­స్‌ తర­ఫున జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­ల్లో అభ్య­ర్థి­గా ది­వం­గత మా­గం­టి గో­పీ­నా­థ్ సతీ­మ­ణి సు­నీ­త­ను ఖరా­రు చేసే అవ­కా­శం ఉన్న­ట్టు సమా­చా­రం. తా­జా­గా బీ­ఆ­ర్‌­ఎ­స్‌ కా­ర్య­క­ర్త సమా­వే­శం­లో కే­టీ­ఆ­ర్‌ సహా సు­నీత పా­ల్గొ­న్నా­రు. తె­లం­గాణ భవ­న్‌­లో జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గ బీ­ఆ­ర్ఎ­స్ కా­ర్య­క­ర్త­ల­తో కే­టీ­ఆ­ర్ సమా­వే­శ­మ­య్యా­రు. ఈ సమా­వే­శం­లో మా­గం­టి గో­పీ­నా­థ్‌ సతీ­మ­ణి.. మా­గం­టి సు­నీత పా­ల్గొ­న్నా­రు.ఈ సమావేశంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తల పనితీరు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఈ నే­ప­థ్యం­లో ఉప ఎన్ని­క­ల్లో అభ్య­ర్థి­గా ఆమె పే­రు­ను ఖరా­రు చేసే అవ­కా­శం ఉన్న­ట్టు తె­లు­స్తోం­ది. ఇక, ఇప్ప­టి­కే జూ­బ్లీ­హి­ల్స్ ఉప‌ ఎన్నిక కోసం బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఇం­చా­ర్జ్‌­ల­ను ని­య­మిం­చిం­ది. కా­ర్య­క­ర్త­ల­కు కే­టీ­ఆ­ర్‌.. ది­శా­ని­ర్దే­శం చే­స్తు­న్నా­రు.  సెం­టి­మెం­ట్ వర్కౌ­ట్ అవు­తుం­ద­నే నే­ప­థ్యం­లో గో­పీ­నా­థ్ భా­ర్య సు­నీ­త­కే బీ­ఆ­ర్ఎ­స్ టి­కె­ట్ కే­టా­యిం­చే అవ­కా­శం కని­పి­స్తోం­ది. ఈ క్ర­మం­లో­నే మా­గం­టి సు­నీత తన ఇద్ద­రు కూ­తు­ళ్లు అక్షర, ది­శి­ర­ను జనా­ల్లో­కి పం­పు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. మాగంటి సునీతను త్వరలోనే అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల ప్రచారం ఆరంభించాలని బీఆర్ఎస్ చూస్తోంది.

సునీతకు ఆశీస్సులు ఉండాలి: కేటీఆర్

ఈ సమా­వే­శం­లో కే­టీ­ఆ­ర్ మా­ట్లా­డు­తూ మా­గం­టి సు­నీ­త­కు అం­ద­రి ఆశీ­స్సు­లు ఉం­టా­య­ని ఆశి­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో భారీ మె­జా­రి­టీ­తో భారత రా­ష్ట్ర సమి­తి గె­లు­పే గో­పీ­నా­థ్‌­కు సరైన ని­వా­ళ­ని తె­లి­పా­రు. అం­ద­రూ ఆశీ­ర్వ­ది­స్తే గో­పీ­నా­థ్ కు­టుం­బం మళ్లీ గౌ­ర­వం­గా ఉం­టుం­ద­న్నా­రు. మా­గం­టి సు­నీత మా­ట్లా­డు­తూ మా­గం­టి గో­పీ­నా­థ్‌­కు అం­డ­గా ని­లి­చి­న­ట్లే తనకు అం­డ­గా ని­ల­వా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. గో­పీ­నా­థ్ ఆశ­యా­లు నె­ర­వే­ర్చేం­దు­కు అం­ద­ర­మూ కలి­సి పని­చే­ద్దా­మ­న్నా­రు.

Tags:    

Similar News