వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.. ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందితో ఆయన చేసిన వీడియో షూట్ ఇప్పుడు రచ్చ అవుతోంది.. సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన జనం ఎమ్మెల్యే తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తీరుపై విపక్షాలు కూడా ఫైరవుతున్నాయి.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మూడ్రోరజులుగా అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు.. ఆ యాగం ఇవాళ్టితో ముగిసింది.. యాగం ముగిసిన తర్వాత రోహిత్ రెడ్డి భద్రతా సిబ్బందితో ఓ వీడియో తీయించుకున్నారు.. వీడియో షూట్‌లో రోహిత్ రెడ్డి స్లో మోషన్‌లో వస్తుంటే.. ఆయన వెనక నుంచి భద్రతా సిబ్బంది ఆయుధాలతో వస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత రోహిత్ రెడ్డికి రాష్ట్రప్రభుత్వం భద్రత పెంచింది.. వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు పోలీసు భద్రతను ప్రభుత్వం కల్పించింది.. అయితే, ఆ సెక్యూరిటీని ఎమ్మెల్యే మిస్ యూజ్ చేశారని విపక్షాలు ఫైరవుతున్నాయి.