BRS: పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు

స్ప­ష్ట­మైన వి­వ­రణ ఇవ్వా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ ఆదేశం

Update: 2026-03-17 06:00 GMT

మొ­యి­నా­బా­ద్‌­లో వె­లు­గు­లో­కి వచ్చిన డ్ర­గ్స్ కేసు నే­ప­థ్యం­లో మాజీ ఎమ్మె­ల్యే పై­ల­ట్ రో­హి­త్ రె­డ్డి­పై భా­ర­త్ రా­ష్ట్ర సమి­తి (బీ­ఆ­ర్‌­ఎ­స్) పా­ర్టీ క్ర­మ­శి­క్ష­ణా­త్మక చర్య­ల­కు శ్రీ­కా­రం చు­ట్టిం­ది. ఈ వ్య­వ­హా­రం­లో ఆయన పేరు మీ­డి­యా­లో ప్ర­స్తా­వ­న­కు రా­వ­డం­తో పా­ర్టీ క్ర­మ­శి­క్షణ కమి­టీ ఆయ­న­కు షో­కా­జ్ నో­టీ­సు జారీ చే­సిం­ది. హై­ద­రా­బా­ద్ పరి­సర ప్రాం­తా­ల్లో జరి­గిన ఒక సమా­వే­శం­లో మా­ద­క­ద్ర­వ్యాల వి­ని­యో­గం జరి­గిం­ద­ని వచ్చిన వా­ర్తల నే­ప­థ్యం­లో, ఆ సమ­యం­లో రో­హి­త్ రె­డ్డి అక్కడ ఉన్నా­ర­నే ఆరో­ప­ణ­ల­ను పా­ర్టీ తీ­వ్రం­గా పరి­గ­ణిం­చిం­ది. ఈ పరి­ణా­మా­ల­పై స్ప­ష్ట­మైన వి­వ­రణ ఇవ్వా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ నా­య­క­త్వం కో­రిం­ది. పా­ర్టీ తర­ఫున జారీ చే­సిన నో­టీ­సు­లో, డ్ర­గ్స్ వి­ని­యో­గం జరి­గి­న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తు­న్న కా­ర్య­క్ర­మా­ని­కి ఆయన హా­జ­ర­య్యా­ర­నే అం­శం­పై ఏడు రో­జు­ల­లో­పు లి­ఖి­త­పూ­ర్వ­కం­గా సమా­ధా­నం ఇవ్వా­ల­ని ఆదే­శిం­చా­రు. ఇలాం­టి అక్రమ కా­ర్య­క­లా­పా­ల­తో సం­బం­ధం కలి­గి ఉం­డ­టం పా­ర్టీ ప్ర­తి­ష్ట­కు మరి­యు పా­ర్టీ సి­ద్ధాం­తా­ల­కు వి­రు­ద్ధ­మ­ని పే­ర్కొ­న్నా­రు. పా­ర్టీ అధి­నేత కె. చం­ద్ర­శే­ఖ­ర్ రావు సూ­చ­నల మే­ర­కు ఈ నో­టీ­సు జారీ చే­సి­న­ట్లు పా­ర్టీ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి సోమ భరత్ కు­మా­ర్ వె­ల్ల­డిం­చా­రు.

స్పష్టత వచ్చే వరకు...

ఇక ఈ వ్య­వ­హా­రం స్ప­ష్ట­త­కు వచ్చే వరకు రో­హి­త్ రె­డ్డి పా­ర్టీ కా­ర్య­క్ర­మా­లు, అధి­కా­రిక సమా­వే­శా­ల­కు హా­జ­రు­కా­కూ­డ­ద­ని కూడా పా­ర్టీ స్ప­ష్టం చే­సిం­ది. గడు­వు­లో­పు ఆయన నుం­చి సం­తృ­ప్తి­క­ర­మైన వి­వ­రణ రా­క­పో­తే, పా­ర్టీ రా­జ్యాం­గం ప్ర­కా­రం తదు­ప­రి క్ర­మ­శి­క్షణ చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని హె­చ్చ­రిం­చిం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చి ముం­ద­స్తు నో­టీ­సు ఇవ్వ­కుం­డా­నే చర్య­లు చే­ప­ట్టే అవ­కా­శ­ముం­ద­ని పా­ర్టీ వర్గా­లు సూ­చిం­చా­యి. ఇప్ప­టి­కే ఈ డ్ర­గ్స్ కే­సు­పై ప్ర­భు­త్వం ప్ర­త్యేక దర్యా­ప్తు బృం­దం (సిట్)ను ఏర్పా­టు చేసి వి­చా­రణ కొ­న­సా­గి­స్తు­న్న నే­ప­థ్యం­లో, అదే సమ­యం­లో సొంత పా­ర్టీ కూడా రో­హి­త్ రె­డ్డి­పై క్ర­మ­శి­క్షణ చర్య­లు ప్రా­రం­భిం­చ­డం రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. కేసు దర్యా­ప్తు ఎలా ముం­దు­కు సా­గు­తుం­దో, రో­హి­త్ రె­డ్డి ఇచ్చే వి­వ­ర­ణ­పై పా­ర్టీ ఎలాం­టి ని­ర్ణ­యం తీ­సు­కుం­టుం­దో అన్న­దా­ని­పై ఆస­క్తి నె­ల­కొం­ది.

Tags:    

Similar News