రోడ్డు పనులు జెడ్పీటీసీ అడ్డుకుంటున్నాడని గ్రామస్తుల ఆందోళన
రోడ్డు పనులు బీఆర్‌ఎస్ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ ఆపేశాడంటూ రోడ్డుపై ధర్నా, రాస్తా రోకో చేశారు ప్రజలు;
రోడ్డు పనులను జెడ్పీటీసీ అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు గ్రామ ప్రజలు. ఈ ఘటన మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట మండలం పోతిన్ పల్లిలో జరిగింది. కసాన్‌పల్లి, గోపాల్పూర్, నడిమి తండా పరిధిలోని రోడ్డు పనులను బీఆర్‌ఎస్ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ ఆపేశాడంటూ రోడ్డుపై ధర్నా, రాస్తా రోకో చేశారు ప్రజలు. దాదాపు 20 ఏళ్ల క్రితం మంజూరైన ఈ రోడ్డు ఇప్పటికి పూర్తి కాలేదని మండిపడ్డారు గ్రామప్రజలు. ఇప్పుడు నిధులు మంజూరై పనులు జరుగుతుండగా... జెడ్పీటీసీ శ్రీనివాస్ అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. రోడ్డుపై ధర్నా చేయడంతో.. వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.