పాలు తాగాలంటే కొడంగికి కూడా 'బుల్లెట్ బండి' పాట కావాలంట..

అమ్మ లేదు.. పాలు తాగాలంటే కోతికి కూడా బుల్లెట్ బండి పాట కావాలంట.

Update: 2021-08-26 09:09 GMT

అమ్మ లేదు.. పాలు తాగాలంటే కోతికి కూడా బుల్లెట్ బండి పాట కావాలంట. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లిలోని కోతుల బెడదతో ఓ పిండి మిల్లు యజమాని... కొండెంగను పెంచుతున్నాడు. ఆ కొండెంగకు ఓ పిల్ల కూడా ఉంది. వారం క్రితం తల్లి కొండెంగ అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి పిల్ల కొండెంగ బెంగతో తిండి తినడం లేదు. పాలు తాగడం లేదు. దిగులుగా కూర్చుని ఉంటోంది. యజమాని ఎంత ప్రయత్నించినా... ఏమీ తినిపించలేకపోయాడు. కానీ స్థానికంగా కొందరు యువకులు బుల్లెట్టు బండి పాటను కొండెంగకు వినిపించి... పాలు తాగించేందుకు ట్రై చేశారు. ఇంకేముంది... ఆ పాట వింటూ హాయిగా పాలు తాగింది. అప్పటి నుంచి పాట వినిపిస్తూ పాలు తాగిస్తున్నాడు దాని యజమాని.




 


Tags:    

Similar News