వరంగల్ రాజకీయాలను వేడెక్కించిన బండి సంజయ్ సవాల్
ఓరుగల్లు అభివృద్ధి నిధుల మళ్లింపుపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా అంటూ బండి సంజయ్ విసిరిన సవాల్ వరంగల్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.;
ఓరుగల్లు అభివృద్ధి నిధుల మళ్లింపుపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా అంటూ బండి సంజయ్ విసిరిన సవాల్ వరంగల్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. సంజయ్ ఇచ్చిన 48 గంటల గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు తోక ముడిచారని, కేంద్రం ఇచ్చిన 196 కోట్లు దారిమళ్లించినట్లు వారు ఒప్పుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌కు అన్యాయం చేసిందని, కేంద్రం ఇచ్చిన 196 కోట్లలో కేవలం 33 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతల తీరు మారకుంటే దుబ్బాక ఫలితమే వరంగల్‌లోనూ వస్తుందని హెచ్చరించారు.