సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లోని లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. రైతులను కావాలని రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. లగచెర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేత సామా రాంమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కలెక్టర్ పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి.. కేటీఆర్ కు ఆరు సార్లు ఫోన్ చేసి మాట్లాడారని సామా ట్వీట్ లో తెలిపారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కొడంగల్ లో అల్లర్లకు కర్త, కర్మ, క్రియ కేటీఆరే అన్నారు రాంమోహన్ రెడ్డి. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని హెచ్చరించారు.