TG : తీన్మార్ మల్లన్న, కవితపై కేసు నమోదు

Update: 2025-07-14 09:30 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో తీన్మార్ మల్లన్నతో సహా పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, మల్లన్న గన్‌మెన్ ఆత్మరక్షణ కోసం గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయబడింది. కవిత స్వయంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. మల్లన్న కార్యాలయంపై దాడి, హత్యాయత్నం ఆరోపణలతో తీన్మార్ మల్లన్న కూడా కవిత, ఆమె అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కవితపై కూడా కేసు నమోదైంది. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Full View

Tags:    

Similar News