సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు మాయం
గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో ఎక్కడా కవిత పేరు కనిపించలేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటిదాకా సీబీఐ ప్రశ్నించిన వారి.. జాబితాలోనూ కవిత పేరు కనిపించలేదు.;
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన.. రెండో చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది ప్రత్యేక కోర్టు. గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో ఎక్కడా కవిత పేరు కనిపించలేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటిదాకా సీబీఐ ప్రశ్నించిన వారి.. జాబితాలోనూ కవిత పేరు కనిపించలేదు. ఏప్రిల్ 25న అనుబంధ చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. సుమారు 5వేల 700 పేజీలతో రెండో ఛార్జ్‌షీట్ వేసింది సీబీఐ. ఆ తర్వాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటిదాకా ప్రశ్నించి 89మంది వివరాల్ని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వైఖరికి.. ఆమె విషయంలో స్పష్టమైన ఆధారాలు లేకనా? మరేదైనా కారణమా అని చర్చ జరుగుతోంది.
మే నాలుగో తేదీన 4వ అనబంధ ఛార్జ్‌షీట్ వేసింది ఈడీ. 270 ప్రధాన పత్రాలు.. సుమారు 2వేల అనుబంధ పేజీలతో.. నాలుగో అదనపు ఛార్జ్‌షీట్ వేసింది ఈడీ. ఈనెల 30న ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై.. ఉత్తర్వులు వెలువరించనుంది ప్రత్యేక కోర్టు. రెండు ఛార్జ్‌షీట్లలోనూ ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే.. సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈడీ తాజా ఛార్జ్‌షీట్‌లోనూ కవితపై రొటీన్ అభియోగాలనే.. మోపినట్లు విశ్వసనీయ సమాచారం.
లిక్కర్ కేస్ దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ ప్రశ్నించాయి. కవిత నిందితుల్ని కలిశారు, సమావేశమయ్యారు, మాట్లాడారు లాంటి.. గత అభియోగాలనే మరోసారి ఈడీ పునదుర్ఘాటించినట్లు విశ్వసనీయ సమాచారం. ముడుపుల వ్యవహారానికి సబంధించి కూడా.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ఎక్కడా లేనట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలోనూ.. కవిత పేరు లేనట్లు తెలుస్తోంది. గతంలో మూడుసార్లు కవితను విచారణకు పిలిచి ఈడీ ప్రశ్నించింది.
కవిత పేరు పలుసార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో.. కవిత పేరు లేదంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. నిందితులతో కవిత పలుసార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీ అని పిళ్లై చెప్పారన్న రోటీన్ అభియోగాలనే.. తిరిగి ఈడీ మోపినట్లు సమాచారం.