Telangana Municipal Election : పురపోరు.. పార్టీలు ఏం నేర్చుకోవాలి..

Update: 2026-02-16 07:14 GMT

మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ఎన్నడూ ఇవ్వనంత డిఫరెంట్ ఫలితాన్ని ఇచ్చాయి. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా చాలా మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. ఓటు షేరింగ్ కూడా ఏ పార్టీకి కూడా అనుకున్నట్టు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. బిఆర్ఎస్ పార్టీకి 29 పర్సంటేజ్, బిజెపికి 16% వచ్చాయి. మిగిలిన పార్టీలకు కలిపి 15% వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ 60 మున్సిపాలిటీలకు పైగా గెలిచింది. ఐదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ఎన్నడు లేని విధంగా బిఆర్ఎస్ పార్టీకి ఒక్క కార్పొరేషన్ కూడా దక్కలేదు. నాలుగు మునిసిపాలిటీల్లో ఒక్క సీటు కూడా ప్రతిపక్ష పార్టీ గెలవలేదు. అటు బిజెపి అనూహ్యంగా రెండు కార్పొరేషన్లను కైవసం చేసుకోవడానికి రెడీ అయింది. ఈసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చాలామంది గెలుపొందారు. ఇది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం.

అన్ని పార్టీలు రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ చెబుతున్నాయి కానీ.. గ్రౌండ్ రియాల్టీని ఒకసారి గమనిస్తే ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మద్దతు రావట్లేదు అనేది అర్థం అయిపోతుంది. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడంలో పెద్దగా సందేహం లేదు. కానీ బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా అనుకున్న స్థాయిలో స్థానాలు సాధించట్లేదు. అటు బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ ఓటు శాతాన్ని సీట్ల శాతాన్ని పెంచుకుంటుంది. కాకపోతే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయేంత మెజారిటీ మాత్రం ఇది కాదు. ఈ ఫలితాలను బట్టి ప్రజలు ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వట్లేదని తేలిపోయింది.

కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మాత్రం ఇప్పటినుంచే పార్టీలు గ్రౌండ్ రియాల్టీని పసిగడుతూ పనిచేయాలి. సోషల్ మీడియా హైప్ ను కాకుండా గ్రౌండ్ లో ప్రజల సమస్యలపై పోరాడిన వారికే ఖచ్చితమైన మెజార్టీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రశ్నించే వారి కంటే.. గ్రౌండ్ లో ప్రజా సమస్యలపై పోరాడే వారికే ఎక్కువగా మద్దతు లభిస్తుందనేది ఇక్కడ అన్ని పార్టీలు గుర్తుంచుకోవాలి. మరి ఇక నుంచి అయినా అన్ని పార్టీలు నేల మీదకు దిగి కొట్లాడుతాయా లేదంటే సోషల్ మీడియాకే పరిమితం అవుతాయా అనేది చూడాలి.

Tags:    

Similar News