Telangana: తెలంగాణ నుంచి బియ్యం సేకరణపై కేంద్రం క్లారిటీ..
Telangana: తెలంగాణ నుంచి నుంచి సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.;
Telangana: తెలంగాణ నుంచి నుంచి సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీల శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 7వ తేదీ నుంచి.. జులై 19 వరకు సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ బియ్య సేకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఆహార ధాన్యాలు పంపిణీ చేయలేదని.. అలాగే డిఫాల్ట్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని కారణంగా బియ్యం సేకరణ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మళ్లీ బియ్యం సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీతో జులై 20 నుంచి సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే 2021-22 ఖరీఫ్ సీజన్‌లో కూడా బియ్యం సేకరణ నిలిపివేయలేదని.. ఖరీఫ్, రబీ సీజన్‌లో 79.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర సహాయ మంత్రి క్లారిటీ ఇచ్చారు.