AP: మరో సంచలన నిర్ణయం దిశగా ఏపీ సర్కార్

బాణాసంచ పేలుళ్ల నివారణ దిశగా కఠిన నిబంధనలు

Update: 2026-03-06 06:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఇటీ­వల చో­టు­చే­సు­కు­న్న బా­ణ­సం­చా పే­లు­ళ్ల ఘట­న­లు రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా తీ­వ్ర ఆం­దో­ళ­న­కు కా­ర­ణ­మ­య్యా­యి. అనేక చో­ట్ల అజా­గ్ర­త్త­గా బా­ణ­సం­చా ని­ల్వ చే­య­డం, భద్ర­తా ని­బం­ధ­న­లు పా­టిం­చ­క­పో­వ­డం వల్ల జరి­గిన ప్ర­మా­దా­ల్లో పలు­వు­రు ప్రా­ణా­లు కో­ల్పో­వ­డం­తో పాటు అనేక మంది గా­య­ప­డిన ఘట­న­లు నమో­ద­య్యా­యి. ఈ నే­ప­థ్యం­లో భవి­ష్య­త్తు­లో ఇలాం­టి ప్ర­మా­దా­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా కఠిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. బా­ణ­సం­చా పే­లు­ళ్ల­కు కా­ర­ణ­మ­య్యే ని­ర్వా­హ­కు­ల­పై కఠిన చర్య­లు తీ­సు­కో­వ­డం­తో పాటు వారి ఆస్తు­ల­ను కూడా జప్తు చేసి బా­ధి­తు­ల­కు అం­దిం­చే­లా చర్య­లు చే­ప­ట్టేం­దు­కు ప్ర­భు­త్వం సి­ద్ధం­గా ఉం­ద­ని రా­ష్ట్ర హోం­మం­త్రి వం­గ­ల­పూ­డి అనిత స్ప­ష్టం­చే­శా­రు.

శా­స­న­స­భ­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అగ్ని­మా­పక సేవల చట్టా­ని­కి సవరణ బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టిన సం­ద­ర్భం­గా ఆమె ఈ వి­ష­యా­న్ని వె­ల్ల­డిం­చా­రు. సభ ఆమో­దం అనం­త­రం మా­ట్లా­డిన హోం­మం­త్రి అనిత, రా­ష్ట్రం­లో అగ్ని ప్ర­మా­దా­ల­ను ని­వా­రిం­చేం­దు­కు చట్టం­లో మా­ర్పు­లు చే­య­డం అవ­స­ర­మైం­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఇటీ­వల జరి­గిన కొ­న్ని ప్ర­మా­దా­లు ప్ర­భు­త్వా­న్ని ఆలో­చ­న­లో పడే­శా­య­ని, ము­ఖ్యం­గా బా­ణ­సం­చా ని­ల్వ­లు, పే­లు­డు పదా­ర్థాల ని­ర్వ­హ­ణ­లో ని­ర్ల­క్ష్యం కా­ర­ణం­గా భారీ నష్టా­లు జరు­గు­తు­న్నా­య­ని ఆమె చె­ప్పా­రు. అం­దు­కే ఇలాం­టి ఘట­న­ల­ను అరి­క­ట్టేం­దు­కు ప్ర­భు­త్వం కఠిన చర్య­లు తీ­సు­కు­నే ది­శ­గా ముం­దు­కె­ళ్తోం­ద­ని వి­వ­రిం­చా­రు. బా­ణ­సం­చా పే­లు­ళ్ల­కు కా­ర­ణ­మైన ని­ర్వా­హ­కు­లు లేదా బా­ధ్యు­ల­పై కే­వ­లం కే­సు­లు నమో­దు చే­య­డం మా­త్ర­మే కా­కుం­డా, వారి ఆస్తు­ల­ను కూడా జప్తు చేసే వి­ధా­నా­న్ని ప్ర­భు­త్వం పరి­శీ­లి­స్తు­న్న­ట్లు ఆమె తె­లి­పా­రు. ప్ర­మా­దా­ల్లో గా­య­ప­డి­న­వా­రి­కి లేదా ప్రా­ణా­లు కో­ల్పో­యిన వారి కు­టుం­బా­ల­కు నష్ట­ప­రి­హా­రం అం­దిం­చేం­దు­కు ఈ ఆస్తు­ల­ను వి­ని­యో­గిం­చే­లా చర్య­లు తీ­సు­కు­నే అవ­కా­శ­ముం­ద­ని హోం­మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. ప్ర­జల ప్రా­ణాల వి­ష­యం­లో ప్ర­భు­త్వం ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ రాజీ పడ­ద­ని ఆమె హె­చ్చ­రిం­చా­రు. తప్పు చే­సిన వా­రి­ని వది­లే ప్ర­స­క్తే లే­ద­న్నా­రు.

Tags:    

Similar News