తెలంగాణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదు : కేసీఆర్
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని.. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్;
తెలంగాణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని.. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను సూచించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత అధికంగా లేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని.. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. విద్యాసంస్థలు మూసివేత కూడా తాత్కాలికమే.. ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.