కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ ..!
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.;
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ క్యాడర్ సమీక్ష.. తదితర అంశాలపై అమిత్‌షాతో చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు పూర్తిగా కేంద్ర నిధులపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు కోసం స్థలం అడిగే అవకాశం ఉంది. నిన్న ప్రధానితో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా అమిత్ షాతో భేటీ జరగనుంది.