గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ శనివారం భేటీ అయ్యారు;
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ శనివారం భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. అనంతరం తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్ పరామర్శించారు.
తమిళసై బాబాయ్ వసంత కుమార్ కన్నుమూశారు. కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడైనా వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.