REVANTH: సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... సిని పరిశ్రమ కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్న రేవంత్‌రెడ్డి;

Update: 2024-12-26 08:56 GMT

సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్‌ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో.. అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకు మధ్య వివాదం మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇండస్ట్రీలోని సమస్యలను తెలిపేందుకు సినీ పెద్దలు కొందరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా.. హాజరైన పెద్దలు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అనంతరం ఈ సమావేశానికి కారణమైన తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాకు తెలిపారు.

దిల్ రాజు ఏం చెప్పారంటే..

సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున జరిగిన సమావేశమిదని దిల్ రాజు వెల్లడించారు. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య FDC చైర్మన్‌గా తాను ముందు ఉండి నడిపించానని... ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకి గౌరవం ఉందన్నారు. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో చూడాలని సీఎం భావించారని వెల్లడించారు. ఇండస్ట్రీ కూడా సీఎం వ్యూ కు తగినట్లుగా.. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తాం అని హామీ ఇచ్చారుని తెలిపారు.

సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్‌ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో.. అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకు మధ్య వివాదం మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇండస్ట్రీలోని సమస్యలను తెలిపేందుకు సినీ పెద్దలు కొందరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా.. హాజరైన పెద్దలు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అనంతరం ఈ సమావేశానికి కారణమైన తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాకు తెలిపారు.

దిల్ రాజు ఏం చెప్పారంటే..

సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున జరిగిన సమావేశమిదని దిల్ రాజు వెల్లడించారు. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య FDC చైర్మన్‌గా తాను ముందు ఉండి నడిపించానని... ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకి గౌరవం ఉందన్నారు. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో చూడాలని సీఎం భావించారని వెల్లడించారు. ఇండస్ట్రీ కూడా సీఎం వ్యూ కు తగినట్లుగా.. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తాం అని హామీ ఇచ్చారుని తెలిపారు.

Tags:    

Similar News