కలెక్టర్‌ నారాయణరెడ్డికే షాకిచ్చిన సైబర్‌ కేటుగాళ్లు

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికే షాకిచ్చారు కొందరు సైబర్‌ కేటుగాళ్లు. కలెక్టర్‌ నారాయణరెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. అంతే కాదు..;

Update: 2020-11-05 05:02 GMT

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికే షాకిచ్చారు కొందరు సైబర్‌ కేటుగాళ్లు. కలెక్టర్‌ నారాయణరెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. అంతే కాదు.. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు పెట్టారు. ఇది గమనించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి.. ఫేక్‌ అకౌంట్‌పై తన అసలు ఖాతాలో ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచించారు. ఫేక్‌ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్‌. దీనిపై దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News