CONGRESS: మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

బర్దిపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన... ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం... కేసీఆర్, కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోంది

Update: 2026-02-07 02:30 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ వాతావరణం తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలతో దూకుడు పెంచుతున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం, అభివృద్ధి హామీలతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పోరాటం నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు… సీఎం ప్రసంగం మొత్తం ఎన్నికల నినాదంగా మారింది.

రేవంత్ తీవ్ర విమర్శలు

ని­జా­మా­బా­ద్ రై­తుల పో­రా­టం దే­శా­ని­కే ఆద­ర్శ­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. ‘ప్ర­జా పాలన – ప్ర­గ­తి బాట’ కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా ని­జా­మా­బా­ద్ జి­ల్లా డి­చ్‌­ప­ల్లి మం­డ­లం బర్ది­పూ­ర్‌­లో పర్య­టిం­చిన సీఎం, పలు అభి­వృ­ద్ధి పను­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­రం ఏర్పా­టు చే­సిన బహి­రంగ సభలో మా­ట్లా­డు­తూ… ని­జా­మా­బా­ద్‌­లో­ని వ్య­వ­సా­యం తె­లం­గా­ణ­కే కాదు, దే­శా­ని­కే ది­శా­ని­ర్దే­శం చే­స్తోం­ద­ని కొ­ని­యా­డా­రు. ని­జా­మా­బా­ద్ రై­తు­లు తమ హక్కుల కోసం చే­సిన పో­రా­టం చరి­త్ర­లో ని­లి­చి­పో­యిం­ద­ని, ఆ పో­రాట స్ఫూ­ర్తి­తో­నే కాం­గ్రె­స్ పా­ర్టీ 2028లో కూడా పో­రా­డి మళ్లీ అధి­కా­రం­లో­కి వస్తుం­ద­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. జి­ల్లా­లో పెం­డిం­గ్‌­లో ఉన్న ప్రా­జె­క్టు­ల­ను పూ­ర్తి చే­సేం­దు­కు అద­న­పు ని­ధు­లు ఇవ్వ­డా­ని­కి ప్ర­భు­త్వం ప్ర­య­త్ని­స్తుం­ద­ని హామీ ఇచ్చా­రు. పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్ కు­మా­ర్ గౌడ్ సూ­చ­న­ల­తో ఈ జి­ల్లా­లో అభి­వృ­ద్ధి పను­ల­కు శ్రీ­కా­రం చు­ట్టా­మ­ని సీఎం తె­లి­పా­రు. ము­న్సి­ప­ల్ ఎన్ని­కల నే­ప­థ్యం­లో కాం­గ్రె­స్ జెం­డా ఎగ­ర­వే­య­డ­మే లక్ష్యం­గా పని­చే­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. “మన వా­ళ్లు కా­ర్పొ­రే­ట­ర్లు­గా ఉం­టే­నే అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­వు­తుం­ది. రా­ష్ట్ర ప్ర­భు­త్వం­తో కలి­సి పని­చే­సే వా­రి­కే ఓటు వే­యా­లి” అని ప్ర­జ­ల­కు పి­లు­పు­ని­చ్చా­రు. ని­జా­మా­బా­ద్ రై­తుల పో­రా­టం దే­శా­ని­కే ఆద­ర్శం అని కొ­ని­యా­డా­రు. ని­జా­మా­బా­ద్ రై­తుల పో­రాట స్ఫూ­ర్తి­తో 2028లో ఫైట్ చే­స్తాం.. మళ్లీ అధి­కా­రం­లో­కి వస్తా­మ­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. ని­జా­మా­బా­ద్ జి­ల్లా­లో­ని ప్రా­జె­క్టు­ల­ను పూ­ర్తి చే­సేం­దు­కు అద­న­పు ని­ధు­లు ఇవ్వ­డా­ని­కి ప్ర­య­త్నం చే­స్తా­మ­ని అన్నా­రు.

బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు

పదే­ళ్ల బీ­ఆ­ర్‌­ఎ­స్ పా­ల­న­లో ని­జా­మా­బా­ద్ ము­రి­కి కూ­పం­గా మా­రిం­ద­ని సీఎం తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చా­రు. మౌ­లిక వస­తు­లు, పట్ట­ణా­భి­వృ­ద్ధి పూ­ర్తి­గా ని­ర్ల­క్ష్యం చే­య­బ­డిం­ద­న్నా­రు. బీ­ఆ­ర్‌­ఎ­స్ ప్ర­భు­త్వం ప్ర­జల సమ­స్య­ల­ను పట్టిం­చు­కో­లే­ద­ని ఆరో­పిం­చా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­లో అవి­నీ­తి జరి­గిం­ద­ని బీ­జే­పీ చె­ప్పిం­ద­ని గు­ర్తు చే­సిన సీఎం, ఆ కే­సు­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చిన తర్వాత ఏం జరి­గిం­ద­ని ప్ర­శ్నిం­చా­రు. కే­సీ­ఆ­ర్‌, కే­టీ­ఆ­ర్‌­ల­ను ఎప్పు­డు అరె­స్ట్ చే­స్తా­ర­ని బీ­జే­పీ­ని ని­ల­దీ­శా­రు. కేం­ద్ర­మం­త్రి కి­ష­న్‌­రె­డ్డి… కే­సీ­ఆ­ర్ కు­టుం­బా­న్ని కా­పా­డు­తు­న్నా­ర­ని ఆరో­పి­స్తూ, “కి­ష­న్‌­రె­డ్డి… కల్వ­కుం­ట్ల కి­ష­న్‌­రా­వు­గా మా­రా­రు” అంటూ తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు.

బీజేపీపై ఫైర్

ని­జా­మా­బా­ద్ ఎం­పీ­గా రెం­డు సా­ర్లు గె­లి­చిన ధర్మ­పు­రి అర్విం­ద్ చే­సిన అభి­వృ­ద్ధి ఏంటో చె­ప్పా­ల­ని సీఎం సవా­ల్ వి­సి­రా­రు. కేం­ద్రం­లో బీ­జే­పీ ప్ర­భు­త్వం ఉన్నా, ని­జా­మా­బా­ద్‌­ను స్మా­ర్ట్ సి­టీ­గా ఎం­దు­కు ప్ర­క­టిం­చ­లే­క­పో­యిం­ద­ని ప్ర­శ్నిం­చా­రు. ప్ర­ధా­ని మోదీ మూడు సా­ర్లు ప్ర­ధా­న­మం­త్రి అయి­నా, ఈ ప్రాం­తా­ని­కి ఏం ఒరి­గిం­ద­ని ని­ల­దీ­శా­రు. ని­జా­మా­బా­ద్ ప్ర­జ­లు ఓట్లు వేసి గె­లి­పిం­చి­న­ప్ప­టి­కీ, ఎంపీ అర్విం­ద్ కేం­ద్రం నుం­చి ఒక్క రూ­పా­యి కూడా తీ­సు­కు­రా­లే­క­పో­యా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. అర్విం­ద్‌­తో పాటు రా­ష్ట్రం­లో­ని బీ­జే­పీ ఎం­పీ­లం­ద­రి­కీ కేం­ద్ర నా­య­క­త్వం వద్ద బలం­గా మా­ట్లా­డే దమ్ము లే­ద­ని ఎద్దే­వా చే­శా­రు. కే­సీ­ఆ­ర్‌, కే­టీ­ఆ­ర్‌, హరీ­ష్‌­రా­వు­ల­ను జై­లు­లో పె­ట్టా­ల­ని అర్విం­ద్ పదే పదే డి­మాం­డ్ చే­స్తు­న్నా­ర­ని గు­ర్తు చే­సిన సీఎం, కా­ళే­శ్వ­రం­పై సీ­బీఐ వి­చా­ర­ణ­కు ఆరు నె­ల­లు దా­టి­నా ఒక్క అరె­స్టు ఎం­దు­కు జర­గ­లే­ద­ని ప్ర­శ్నిం­చా­రు. “48 గం­ట­ల్లో అరె­స్టు చే­స్తా­మ­ని చె­ప్పిన కి­ష­న్‌­రె­డ్డి ఇప్పు­డు ఎక్కడ దా­క్కు­న్నా­డు?” అంటూ ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. తె­లం­గా­ణ­లో జరు­గు­తు­న్న ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల్లో ప్ర­జ­లు వి­ల­క్ష­ణ­మైన తీ­ర్పు ఇవ్వా­ల­ని సీఎం పి­లు­పు­ని­చ్చా­రు. బీ­జే­పీ­కి ఓటు వే­స్తే అది వృథా అవు­తుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం­తో కలి­సి పని­చే­సే వా­రి­కి ఓటు వేసి గె­లి­పిం­చా­ల­ని కో­రా­రు. “గా­డి­ద­కు గడ్డి వేసి… ఆవు­కు పాలు పిం­డి­తే ఎలా వస్తా­యి?” అంటూ వ్యం­గ్య వ్యా­ఖ్య­లు చే­స్తూ, మన బస్తీ, మన కా­ల­నీ అభి­వృ­ద్ధి కా­వా­లం­టే మనో­డే గె­ల­వా­ల­ని చె­ప్పా­రు. కాం­గ్రె­స్‌ కా­ర్పొ­రే­ట­ర్లు గె­లి­స్తే­నే పట్ట­ణాల రూ­పు­రే­ఖ­లు మా­రు­తా­య­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News