చలికి వణుకుతున్నా చలించని మోదీ: కాంగ్రెస్ నేతలు
పార్లమెంట్ బయట రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని;
నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ తరపున జానారెడ్డి పోటీ చేస్తారని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జానారెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని స్టేట్‌మెంట్ ఇచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు రైతు దీక్ష చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ముఖ్యనేతలంతా హాజరయ్యారు. చలికి వణుకుతూ రైతులు ఆందోళన చేస్తున్నా.. మోదీ చలించడం లేదని విమర్శించారు. పార్లమెంట్ బయట రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, ఎల్లుండి జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బీజేపీ తెచ్చిన అన్ని చట్టాలకు టీఆర్‌ఎస్ ఓటు వేసిందని... బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం బయట పడిందని విమర్శించారు.