CONGRESS: జీహెచ్ఎంసీ "హస్త"గతానికి వ్యూహారచన

జూబ్లీహిల్స్ ఊపు కొనసాగించేందుకు కాంగ్రెస్ వ్యూహరచన

Update: 2025-11-18 06:30 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో సత్తా చా­టిన జీ­హె­చ్ఎం­సీ ఎన్ని­క­ల­ను వి­జ­యం సా­ధిం­చా­ల­ని భా­వి­స్తోం­ది. ఈసా­రి ఎలా­గై­నా మే­య­ర్ పీ­ఠా­న్ని కై­వ­సం చే­సు­కో­వా­ల­ని ప్లా­న్ చే­స్తోం­ది. తె­లం­గాణ రా­ష్ట్రం ఆవి­ర్భా­వం తర్వాత పదే­ళ్లూ ప్ర­తి­ప­క్ష పా­త్ర­కే పరి­మి­త­మైన కాం­గ్రె­స్.. గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో అధి­కా­రం­లో­కి వచ్చిం­ది. ఇప్ప­టి­కే రెం­డేం­డ్లు గడి­చి­పో­యా­యి. గత బీ­ఆ­ర్ఎ­స్ హయాం­లో జరి­గిన జీ­హె­చ్ఎం­సీ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్​­సిం­గి­ల్​­డి­జి­ట్‌­కే పరి­మి­త­మైం­ది. రా­ష్ట్రం­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వా­న్ని కొ­లు­వు­దీ­రాక మే­య­ర్ వి­జ­య­ల­క్ష్మి హస్తం గూ­టి­కి చే­రా­రు. ఆమె­తో పాటే చాలా మంది ఇతర పా­ర్టీల కా­ర్పొ­రే­ట­ర్లు సైతం కాం­గ్రె­స్​­తీ­ర్థం పు­చ్చు­కు­న్నా­రు. దీం­తో మే­య­ర్ కు­ర్చీ ప్ర­స్తు­తం కాం­గ్రె­స్ పా­ర్టీ వశ­మైం­ది.

సమయం అసన్నమైనట్లేనా…?

తా­జా­గా­నే జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో కాం­గ్రె­స్ పా­ర్టీ గ్రాం­డ్ వి­క్ట­రీ కొ­ట్టిం­ది. బీసీ అభ్య­ర్థి­కి టి­కె­ట్ ఇవ్వ­ట­మే కాక… మంచి మె­జా­ర్టీ­తో వి­జ­యా­న్ని ఖా­తా­లో వే­సు­కుం­ది. ప్ర­భు­త్వం­పై వ్య­తి­రే­కత లే­ద­న్న వా­ద­న­ను తె­ర­పై­కి తీ­సు­కొ­చ్చే పని­లో కాం­గ్రె­స్ నా­య­క­త్వం ఉంది. అం­దు­కు జూ­బ్లీ­హి­ల్స్ ఫలి­తా­న్ని తె­ర­పై­కి తీ­సు­కు­వ­స్తోం­ది. ఇదే వి­ష­యా­న్ని పలు­వు­రు మం­త్రు­లు, ము­ఖ్య నే­త­లు కూడా చె­బు­తు­న్నా­రు. ప్ర­స్తు­తం జూ­బ్లీ­హి­ల్స్ గె­లు­పు­తో మంచి జోష్ లో ఉన్న కాం­గ్రె­స్ పా­ర్టీ…. ఇక ఆల­స్యం చే­య­కుం­డా స్థా­నిక ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని యో­చి­స్తోం­ది. అందులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇప్ప­టి­కే ఆల­స్య­మైన నే­ప­థ్యం­లో… ఇకపై ఆల­స్యం కా­కుం­డా ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని గట్టి­గా భా­వి­స్తోం­ది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం..

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్నిక పూ­ర్త­యిం­ది. ఇక్కడ అధి­కార పా­ర్టీ సత్తా చా­టిం­ది. అయి­తే, కొ­ద్ది నె­ల­ల్లో­నే జీ­హె­చ్ఎం­సీ ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. ఈ ఎన్ని­క­లు కాం­గ్రె­స్‌­కు కీ­ల­కం­గా మా­ర­ను­న్నా­యి. జూ­బ్లీ­హి­ల్స్‌ బై­పో­ల్‌­లో కాం­గ్రె­స్‌­కు ఎం­ఐ­ఎం పా­ర్టీ మద్ద­తు ఇచ్చిం­ద­ని.. ఫలి­తం­గా గె­లు­పు సు­నా­యా­సం అయ్యిం­ద­నే చర్చ జరు­గు­తు­న్న­ది. వచ్చే గ్రే­ట­ర్ ఎన్ని­క­ల్లో­నూ మజ్లి­స్ మద్ద­తు­ను కాం­గ్రె­స్​­తీ­సు­కుం­టుం­దా? అనే ఆస­క్తి­కర చర్చ ప్ర­స్తుత రా­జ­కీయ వర్గా­ల్లో మొ­ద­లైం­ది. బి­హా­ర్ అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో పోటీ చే­సిన మజ్లీ­స్​­పా­ర్టీ అక్కడ ఏకం­గా ఐదు అసెం­బ్లీ సీ­ట్ల­ను సా­ధిం­చిం­ది. ఎం­ఐ­ఎం బరి­లో ని­ల­వ­డం­తో ఆర్జే­డీ, కాం­గ్రె­స్​­కూ­ట­మి­కి పడా­ల్సిన ము­స్లిం ఓట్లు కా­స్త మజ్లి­స్‌ ఖా­తా­లో పడ్డా­యి. ఇప్పు­డు కూడా ఎం­ఐ­ఎం­తో పొ­త్తు లే­కుం­డా జీ­హె­చ్ఎం­సీ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ ఒం­ట­రి­గా బరి­లో­కి ది­గి­తే ము­స్లిం ఓట్లు చీ­ల­డం ఖాయం. జా­తీయ స్థా­యి­లో మజ్లి­స్​­పా­ర్టీ­కి, కాం­గ్రె­స్‌­కు సం­బం­ధా­లు అం­త­గా బా­లే­వు. కానీ, తె­లం­గా­ణ­లో మా­త్రం కాం­గ్రె­స్‌­తో ఎం­ఐ­ఎం మి­త్ర­ప­క్షం­గా వ్య­వ­హా­రి­స్తు­న్న­ది.

Tags:    

Similar News