వీహెచ్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం.. షోకాజ్ నోటీసులు ఇవ్వనున్న ఏఐసీసీ!
రాష్ట్రంలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత వీహెచ్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది;
VH hanumantharao
రాష్ట్రంలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత వీహెచ్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వీహెచ్‌కు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, వీహెచ్ హైకమాండ్ వైఖరిపై మండిపడ్డారు.
ఎన్ని ఓటములు ఎదురైనా తగిన చర్యలు తీసుకోవడం లేదంటూనే, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు వీహెచ్. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాగూర్.. వీహెచ్ వ్యాఖ్యలపై పూర్తి నివేదిక తెప్పించుకున్నారు. అటు ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఏకే ఆంటోనీకి కూడా రాష్ట్రం నుంచి వీహెచ్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందాయి.