Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై హై కమాండ్ సీరియస్..

Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది.

Update: 2022-07-28 01:27 GMT

Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై ఏ క్షణమైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ నోటీస్ కూడా లేకుండా హైకమాండ్ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

మునుగోడు పంచాయతీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేనుగోపాల్‌ నివాసంలో ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు.

సమావేశానికి పిలుపు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హాజరుకాలేదు. అస్వస్థత కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి కార్యాచరణ అంశంపై సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మార్పుపై పునరాలోచన చేయాలని.. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి సేవలు కాంగ్రెస్‌కు అవసరమన్నారు భట్టి. కాంగ్రెస్‌ పట్ల ఆయనకు గౌరవం ఉందన్నారు. కొన్ని విషయాల్లో రాజగోపాల్‌ రెడ్డికి సమస్యలు ఉన్నాయన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయని తెలిపారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం అన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాటం బీజేపీతోనే సాధ్యమని.. నమ్మి కలిసివచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ కోవర్టు రాజకీయాలను ముందునుంచి వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతాననడంతో.. కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు మంతనాలు సాగించినా.. ఆశించిన ఫలితంలేకుండా పోయింది. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఇదే సమయంలో మునుగోడుకు ఉప ఎన్నికలు వస్తే .. పార్టీ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది.

Tags:    

Similar News