Huzurabad By Election: హుజురాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? గెలుపు గురించి నేతల్లో అయోమయం...
Huzurabad By Election: హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోందా..?;
Huzurabad By Election: హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోందా..? ప్రత్యర్ది పార్టీ గెలుపుపై కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉందా..? ఏ పార్టీ గెలిస్తే తమకు ఎంత నష్టం .. ఎంత లాభం అని హస్తం నేతలు లెక్కలు వేసుకుంటున్నారా..? అందుకే ముందు నుంచి హుజూరాబాద్ ఉపఎన్నికను పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదా.. ఇంతకీ హుజూరాబాద్ ఎన్నికపై కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..?
ప్రత్యేక పరిస్థితుల మధ్య వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ లో కాక రేపుతోంది. సీఎం కేసీఆర్ కేబినేట్‌లో మంత్రి గా పని చేసి బయటకొచ్చిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ ఎన్నిక రావడంతో అధికార టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో హుజురాబాద్ యుద్దభూమిపై టీఆర్‌ఎస్, ఈటల అభ్యర్థిత్వంతో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి.
అయితే గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఏంటి. ఇప్పుడు ఇదే హస్తం నేతల్లో హాట్ టాపిక్. హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రేస్ కు గతంలోఎన్నడు లేనంత కొత్త కష్టం తీసుకువచ్చింది . సొంత పార్టీ గెలుపు దేవుడెరుగు ప్రత్యర్ది పార్టీలలో ఎవరు గెలిస్తే తమ పార్టీకి తక్కువ నష్టం జరుగుతుందనే చర్చ ఇప్పుడు హస్తం నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే ఈ ఎన్నికపై అందరు నేతలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎన్నికల బరిలో టీఆరెఎస్, బిజెపి లు హోరా హోరీగా తలపడుతున్నా .. కాంగ్రెస్ నేతలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ ఉపఎన్నికల్లో మనం ఎలాగూ గెలవడం లేదు కాబట్టి .. టీఆర్ఎస్,బిజెపి ల్లో ఎవరు గెలిస్తే తమకు ఎంత నష్టం,ఎంత లాభం అనే చర్చ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో జోరుగా జరుగుతోంది.
ఈటెల రాజేందర్ గెలిస్తే .. అది ఈటెల స్వంత ఇమేజ్ తో గెలిచినట్టుగానే చూడాలి అంటున్న హస్తం నేతలు .. అయినా బీజేపీ ఆ గెలుపును బాగా వాడుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. తెలంగాణలో ఒక తామే ప్రత్యామ్నాయం అనించెప్పుకునే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ కు నష్టం కలిగే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ లో టిఆర్ఏస్ అధికారంలో ఉంది ,దీంతో పాటు వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా హుజురాబాద్ టీఆరెఎస్ సిట్టింగ్ సీటు. హుజూరాబాద్ లో టిఆర్ఏస్ గెలిచినా కాంగ్రేస్ కు పెద్దగా నష్టం ఉండదని హస్తం పార్టీ లో కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈఎన్నికల్లో టిఆర్ఏస్ గెలిచినా ..అదికార బలం తో ,ఇతర కారణాలతో గెలిచిందని కాంగ్రేస్ చెప్పడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా బిజెపి గెలిస్తే కాంగ్రెస్ లోకి వస్తున్న వలసలు ఆగే ప్రమాదం ఉందనించెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పుంజుకున్న కాంగ్రెస్ కు మళ్ళీ బీజేపీ బ్రేకులు వేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే బాల్మురు వెంకట్ ను బరిలో దించి నామ మాత్రపు పోటికే కాంగ్రెస్ నేతలు ప్రియారిటి ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే ప్రచారంలో కూడా కాంగ్రెస్ అంత యాక్టిివ్ గా లేదని చెబుతున్నారు. గెలిచేందుకు గట్టిగా ప్రయత్నించలేక .. అలాగని పలానా వాళ్ళు గెలవాలని బయటికి అనలేక హస్తం నేతలు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.