ముఖ్యమంత్రి పదవి గురించి కేసీఆర్ హీనంగా మాట్లాడటం బాధాకరం: మధుయాష్కీ
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.;
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి గురించి కేసీఆర్ హీనంగా మాట్లాడటం బాధాకరం అని మధుయాష్కీ అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ మీటింగ్ కోసం మధుయాష్కీ వరంగల్ వెళ్తూ... యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించగా.. కాంగ్రెస్ ఆలేరు ఇంఛార్జి బీర్ల అయిలయ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మధుయాష్కీ.. టీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని యోచించిన కేసీఆర్.. బీసీని సీఎం చేయాలనే చర్చ తెరపైకి రావడంతో భయపడి వెనుకంజ వేశారని అన్నారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు.