CONGRESS: ప్రజల తెలంగాణ లక్ష్యంగా ముందుకు కదలండి

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం సూచనలు...ఖర్గే, రాహుల్‌తో తెలంగాణ నేతల కీలక భేటీ...పాల్గొన్న రేవంత్, భట్టి, మీనాక్షి నటరాజన్... మున్సిపల్ ఎన్నికల విజయంపై ప్రశంసలు

Update: 2026-02-19 10:15 GMT

ఏఐ­సీ­సీ అధ్య­క్షు­డు మల్లి­కా­ర్జున ఖర్గే, కాం­గ్రె­స్ అగ్ర­నేత రా­హు­ల్ గాం­ధీ­తో తె­లం­గాణ కాం­గ్రె­స్ ము­ఖ్య నేతల కీలక సమా­వే­శం ఢి­ల్లీ­లో జరి­గిం­ది. ఖర్గే ని­వా­సం­లో సు­మా­రు రెం­డు గంటల పాటు కొ­న­సా­గిన ఈ భే­టీ­లో తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి, డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క, పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­ష్ కు­మా­ర్ గౌడ్, రా­ష్ట్ర వ్య­వ­హా­రాల ఇన్‌­ఛా­ర్జ్ మీ­నా­క్షి నట­రా­జ­న్‌­తో పాటు పలు­వు­రు మం­త్రు­లు పా­ల్గొ­న్నా­రు. సమా­వే­శం­లో తె­లం­గాణ ప్ర­భు­త్వ రెం­డే­ళ్ల పాలన, పా­ర్టీ బలో­పే­తం, తాజా రా­జ­కీయ పరి­ణా­మా­లు, భవి­ష్య­త్ కా­ర్యా­చ­రణ వంటి అం­శా­ల­పై సమ­గ్ర సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. సమా­వే­శం అనం­త­రం మల్లి­కా­ర్జున ఖర్గే ‘ఎక్స్’ వే­ది­క­గా స్పం­ది­స్తూ తె­లం­గాణ ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ పా­ర్టీ ఘన­వి­జ­యం సా­ధిం­చిం­ద­ని పే­ర్కొ­న్నా­రు. సీఎం, మం­త్రు­లు, పా­ర్టీ నా­య­కు­ల­తో కలి­సి సమ­గ్ర సమీ­క్ష ని­ర్వ­హిం­చా­మ­ని తె­లి­పా­రు. ప్ర­జ­ల­కు ఇచ్చిన హా­మీ­ల­ను అమలు చే­స్తూ, సా­మా­జిక సం­క్షే­మం, ఆర్థిక సా­ధి­కా­రత, ప్ర­తి పౌ­రు­డి­కి న్యా­యం చే­య­డం తమ ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ప్ర­జల ఆకాం­క్ష­ల­ను నె­ర­వే­ర్చే ది­శ­గా కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరాలు అందించారు.

నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం నేతలకు కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, కేడర్‌ను చైతన్యపరచడం, ప్రజలతో మరింత అనుసంధానం పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సమా­వే­శా­ని­కి మం­త్రు­లు శ్రీ­ధ­ర్ బాబు, కో­మ­టి­రె­డ్డి వెం­కట రె­డ్డి, దా­మో­దర రా­జ­న­ర్సిం­హా, అడ్లూ­రి లక్ష్మ­ణ్, అజ­హ­రు­ద్దీ­న్, పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్ రె­డ్డి, జూ­ప­ల్లి కృ­ష్ణా­రా­వు, సీ­త­క్క, కొం­డా సు­రేఖ, ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి తది­త­రు­లు హా­జ­ర­య్యా­రు. తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం చే­ప­ట్టిన కా­ర్య­క్ర­మా­ల­పై అధి­ష్టా­నం సం­తృ­ప్తి వ్య­క్తం చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. ము­ఖ్యం­గా ము­న్సి­ప­ల్ మరి­యు స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో వచ్చిన వి­జ­యా­లు పా­ర్టీ­కి ఉత్సా­హా­న్ని నిం­పా­య­ని ఖర్గే పే­ర్కొ­న్నా­రు.

సమానత్వంతో కూడిన “ప్రజల తెలంగాణ” నిర్మాణమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు పునరుద్ఘాటించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం, పారదర్శక పరిపాలన అందించడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News